
దశాబ్దాల తర్వాత సొంతగడ్డపై ఐసీసీ టోర్నీ జరుగుతుంటే, పాకిస్థాన్ అభిమానుల ఆనందానికి అవధుల్లేవు. కానీ, ఆ ఆనందం ఆవిరయ్యేందుకు ఎంతో సమయం పట్టలేదు. కేవలం ఆరు రోజుల్లోనే వారి ఆశలు అడియాసలయ్యాయి. ఇప్పుడు మిగిలింది ఒక నామమాత్రపు మ్యాచ్ మాత్రమే. ఈ నెల 27న బంగ్లాదేశ్‌తో పాకిస్థాన్ తలపడుతుంది. అయితే, ఈ మ్యాచ్ కేవలం లాంఛనప్రాయమే. సెమీస్ రేసు నుంచి నిష్క్రమించిన తర్వాత ఈ మ్యాచ్ ఆడినా ఒకటే, ఆడకున్నా ఒకటే.
పాకిస్థాన్ క్రికెట్ అభిమానులకు ఇది నిజంగా జీర్ణించుకోలేని అవమానం. సొంతగడ్డపై, అది కూడా ఇంత ప్రతిష్టాత్మక టోర్నీలో ఇలాంటి పరాభవం ఎదుర్కోవడం నిజంగా బాధాకరం. క్రికెట్ చరిత్రలో పాకిస్థాన్ జట్టుకు ఇది ఒక మరపురాని మచ్చగా మిగిలిపోతుంది. ఈ పరాభవం నుంచి పాకిస్తాన్ జట్టు ఎలా కోలుకుంటుందో చూడాలి మరి. ఫ్యాన్స్ మాత్రం ఈ అవమానాన్ని అసలు తట్టుకోలేకపోతున్నారు ప్రతిసారి ఇండియా చేతిలో ఓడిపోవడం ప్రపంచ వేదిక మీద తమ పరువు పోవడం బాధ కలిగిస్తోందని అంటున్నారు.