
వివరాల్లోకి వెళితే... మొదట బ్యాటింగ్ కి దిగిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 325 పరుగుల భారీ స్కోర్ సాధించింది. లక్ష్య ఛేదనలో భాగంగా ఇంగ్లాండ్ 49.5 ఓవర్లలో 317 పరుగులకు ఆలౌట్ కావడం గమనార్హం. ఇంగ్లండ్ తరపున రూట్ సెంచరీ (111 బంతుల్లో 120: 11 ఫోర్లు, ఒక సిక్సర్) చేసినా ఫలితం దక్కకపోవడంతో ఇంగ్లండ్ ఆటగాళ్లు తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఈ మ్యాచ్ ఫలితంతో వరుసగా రెండు ఓటములతో ఇంగ్లాండ్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. మరోవైపు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమిష్టిగా రాణించిన ఆఫ్ఘనిస్థాన్ టోర్నీలో తొలి విజయాన్ని అందుకుని సెమీస్ ఆశలు సజీవంగా కాపాడుకుందనే చెప్పుకోవాలి.
326 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్థాన్ ఆరంభంలోనే 2 వికెట్లను కోల్పోయి, డేంజర్లో పడింది. సాల్ట్ (12), జెమీ స్మిత్ (9) వెంటవెంటనే అవుట్ కావడంతో ఇక ఆఫ్ఘనిస్థాన్ పని అయిపోయిందని అంతా అనుకున్నారు. ఈ క్రమంలోనే 30 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో రూట్, డకెట్ ఇంగ్లాండ్ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. మూడో వికెట్ కు 68 పరుగులు జోడించి పరిస్థితిని చక్కదిద్దారు. అయితే డకెట్(38), బ్రూక్(25) వెంటవెంటనే ఔట్ కావడంతో ఇంగ్లాండ్ 136 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి మరోసారి ఇబ్బందుల్లోకి నెట్టబడింది. అయితే అప్పటికే క్రీజ్ లో పాతుకుపోయిన రూట్ కెప్టెన్ బట్లర్ తో కలిస్ కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పి విజయం వైపు బాటలు వేశారు. ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్(146 బంతుల్లో 177: 12 ఫోర్లు, 6 సిక్సర్లు)ఆకాశమే హద్దుగా చెలరేగి భారీ సెంచరీ చేయడంతో మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 325 పరుగుల భారీ స్కోర్ చేసి విజయ తీరాన్ని చేరింది. కట్ చేస్తే ఇంగ్లాండ్ ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి ఔట్ అయింది!