
ఆఫ్ఘనిస్తాన్ జట్టులో రికార్డు సెంచరీ చేసిన ఇబ్రహీం జద్రాన్, 5 వికెట్లు తీసిన అజ్మతుల్లా ఒమర్జాయ్ పై సొంత టీమ్ మరోసారి గట్టి ఆశలే పట్టుకుంది. మరో వైపు 2 సార్లు ఛాంపియన్ అయిన ఆస్ట్రేలియా సెమీ ఫైనల్ లో అడుగుపెట్టాలని కలలు కంటోంది. ఈ టోర్నీలో ఇంగ్లాండ్ ను ఓడించిన ఆసీస్.. అంతకు ముందు దక్షిణాఫ్రికాతో రెండో మ్యాచ్ వర్షం వల్ల రద్దు కావడంతో పాయింట్లు పంచుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో పోరు.. ఆసీస్ జట్టుకు క్వార్టర్ ఫైనల్ గా మారిందనే విషయం అందరికీ తెలిసిందే.
అయితే ఆఫ్ఘనిస్తాన్ జట్టును తేలికగా తీసుకుంటే మాత్రం ఆసీస్ భారీ మూల్యం చెల్లించక తప్పదు. ఆఫ్ఘనిస్తాన్ తొలి విజయం కోసం పోరాడుతోంది. ఈ మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే.. రెండు జట్లలో ఏదైనా గెలిచే అవకాశం ఉంది. ఆఫ్ఘనిస్తాన్ ఇంగ్లాండ్ ను ఓడించిన తర్వాత ఏది గెలుస్తుందో చెప్పడం అంత సులువేం కాదు. ఆస్ట్రేలియా గతంలో పైచేయి సాధించినప్పటికీ.. ఆఫ్ఘనిస్తాన్ ఇపుడు చాలా బలమైన టీమ్ గా ఎదిగింది. ఈ మ్యాచ్ లాహోర్ లోని గడాఫీ స్టేడియంలో జరుగుతుంది. లాహోర్ లో సాధారణంగా బ్యాటింగ్ ట్రాక్ లు ఉంటాయి. మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లు కీలక పాత్ర పోషించగలరు. టాస్ గెలిచిన తర్వాత ముందుగా బ్యాటింగ్ చేస్తే మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.