
శ్రేయస్ అయ్యర్ సోదరి శ్రేష్టా అయ్యర్ ఒక డ్యాన్స్ కొరియోగ్రాఫర్. అలాగే ఈమె ప్రొఫెషనల్ డ్యాన్సర్ కూడా. ఈమె ఇప్పటికే చాలా స్టేజ్ షో లు కూడా చేసింది. కొన్ని స్పెషల్ సాంగ్స్ కి కూడా కొరియోగ్రఫీ చేసింది అంట. అయితే ఈమె తన సోదరుడు శ్రేయస్ అయ్యర్ మ్యాచ్ లకు హాజరవుతుంది. శ్రేష్టా అయ్యర్ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఫోటోస్, రీల్స్ కూడా నిత్యం షేర్ చేస్తూ ఉంటుంది. దీంతో ఇటీవల ఈమెకి బాలీవుడ్ నుండి ఆఫర్ కూడా వచ్చింది.
నటి శ్రేష్టా అయ్యర్ తాజాగా ఓ ఐటమ్ సాంగ్ తో బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. సర్కార్ బచ్చా అనే సినిమాలో ఈమె ఐటమ్ సాంగ్ లో కనిపించింది. ఆ పాటలో డ్యాన్స్ కూడా చేసింది. అగ్రిమెంట్ కార్లే అనే పాటలో మిడ్డీ లాంటి చిన్న డ్రెస్ వేసుకుని డ్యాన్స్ చేసింది. ఈమె ఈ పాటలో రుస్లాన్ ముంతాజ్, అన్య తివారీలతో కలిసి చిందులేసింది. ఇక సోషల్ మీడియా వేదికగా ఈమె డ్యాన్స్ చూసిన ప్రేక్షకులందరు ఐటెమ్ సాంగ్ చేసే భామలందరికి శ్రేష్టా అయ్యర్ గట్టి పోటీ ఇస్తుందని అంటున్నారు.