
దీంతో ఒక్కసారిగా ఇండియన్స్ కొంతమేరకు టెన్షన్ పడుతూ ఉన్నారు.. ఇక ఈ గాయం ప్రముఖ న్యూజిలాండ్ ప్లేయర్ రచిన్ కొట్టిన బంతిని క్యాచ్ పట్టబోతూ ఉండగా అది షమి ఎడమచేతికి తగలడంతో వెంటనే రక్తం వచ్చిందట. దీంతో చికిత్స అనంతరం షమి తన ఓవర్ని పూర్తి చేశారట. అయితే ఓవర్ ముగిసిన తర్వాత మైదానం నుంచి వెళ్లిపోవడంతో కొంతమేరకు భారత్ ప్లేయర్లు నిరాశలో ఉన్నారు. అయితే ప్రస్తుతం ఇద్దరు ప్లేసర్లు మాత్రమే ఉండడంతో షమీ ఖచ్చితంగ బౌలింగ్ చేయవలసి ఉన్నదట. ఒకవేళ గాయం పెద్దదైతే కచ్చితంగా బౌలింగ్ వేయలేరు షమి.. దీని ఫలితం మ్యాచ్ పైన కూడా చూపి అవకాశం ఎక్కువగా ఉంటుందట. అందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
దాదాపుగా 14 నెలల విరామం తర్వాత షమి టీమ్ ఇండియా తరఫున ఆడడానికి సిద్ధమయ్యారు. 2023 వన్డే ప్రపంచ కప్ లో గాయపడిన తర్వాత మళ్లీ శస్త్ర చికిత్స చేయించుకుని దూరంగా ఉన్న షమి తిరిగి ఇప్పుడు మళ్లీ టీమ్ లోకి ఎంట్రి ఇచ్చారు.. ఇలాంటి సమయంలోనే షమికి గాయం అవడంతో అటు క్రికెట్ అభిమానులు కూడా తీవ్ర నిరాశలో ఉన్నారు. ఈ మ్యాచ్ కోసం తీవ్రస్థాయిలో షమి ప్రాక్టీస్ చేసినట్లుగా తెలుస్తోంది. మరి షమి ఆడుతాడా లేదా అనే విషయం చూడాలి.