అప్పుడు వాళ్లు కుర్రాళ్లు, జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు సీనియర్ ఆటగాళ్లుగా, మళ్లీ ఇండియాను గెలిపించారు. రోహిత్ శర్మ అయితే కెప్టెన్‌గా జట్టును ముందుండి నడిపించడమే కాకుండా, ఫైనల్లో అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. విరాట్ కోహ్లీ సెమీ-ఫైనల్స్‌లో పాకిస్థాన్, ఆస్ట్రేలియా జట్లపై చెలరేగిపోయాడు. రవీంద్ర జడేజా అయితే టోర్నీ మొత్తం బంతితో నిలకడగా రాణించాడు.
వాళ్ల ముగ్గురి ఆట మామూలుగా లేదు. కోహ్లీ ఐదు మ్యాచ్‌లలో ఏకంగా 218 పరుగులు చేశాడు, రోహిత్ 180 రన్స్ కొట్టాడు. జడేజా ఆల్‌రౌండర్‌గా తన సత్తా చాటి, ఐదు వికెట్లు పడగొట్టాడు. ఇప్పుడు వీళ్ళందరినీ రియల్ హీరోస్ అంటూ భారతదేశ వ్యాప్తంగా ప్రజలు పొగుడుతున్నారు. ఇకపోతే భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) రిటైర్ అయిన క్రికెటర్ల కోసం ఒక సూపర్ స్కీమ్ పెట్టింది. అదే పింఛన్ పథకం. ఇది మాజీ ఆటగాళ్లు రిటైర్మెంట్ తర్వాత హాయిగా బతకడానికి ఆర్థికంగా సాయం చేస్తుంది.
ఎవరికి ఎంత పింఛన్ వస్తుంది అనేది వాళ్లు సాధించిన విజయాలపై ఆధారపడి ఉంటుంది. కనీసం 25 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన వాళ్లకు నెలకి రూ.70,000 పింఛన్ ఇస్తారు. సచిన్ టెండూల్కర్ చిన్ననాటి స్నేహితుడు వినోద్ కాంబ్లీ కూడా బీసీసీఐ నుంచి నెలకి రూ.30,000 పింఛన్ తీసుకుంటున్నాడు. సచిన్‌తో పోలిస్తే కాంబ్లీ కెరీర్ తక్కువే అయినా, ఇండియన్ క్రికెట్‌లో ఆయనకు మంచి పేరుంది.
రోహిత్ శర్మ క్రికెట్ కెరీర్ చూస్తే ఇప్పటివరకు 272 వన్డేల్లో 11,092 పరుగులు, 159 టెస్టుల్లో 4,301 పరుగులు, 67 టీ20ల్లో 4,231 పరుగులు చేశాడు. 32 వన్డే సెంచరీలు, 57 హాఫ్ సెంచరీలు బాదిన రోహిత్ ఇండియాలో టాప్ బ్యాట్స్‌మెన్‌లలో ఒకడు. రిటైర్ అయ్యాక, రోహిత్‌కి కూడా నెలకి రూ.70,000 పింఛన్ గ్యారెంటీ.
రవీంద్ర జడేజా 80 టెస్టుల్లో 3,370 పరుగులు, 323 వికెట్లు పడగొట్టాడు. వన్డేల్లో 203 మ్యాచ్‌లలో 230 వికెట్లు తీసి, 2,797 పరుగులు చేశాడు. టీ20ల్లో 74 మ్యాచ్‌లలో 515 పరుగులు, 54 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. రోహిత్, కోహ్లీలాగే జడేజా కూడా రిటైర్ అయ్యాక రూ.70,000 పింఛన్‌కు అర్హుడు అవుతాడు.
ఈ ముగ్గురు ఆటగాళ్లు ఇండియన్ క్రికెట్‌పై చెరగని ముద్ర వేశారు. వాళ్ల రీసెంట్ విజయం, వాళ్ల లాంగ్ కెరీర్‌ను చూస్తే.. వీళ్లు క్రికెట్ లెజెండ్స్‌గా ఎప్పటికీ గుర్తుండిపోతారు అనడంలో సందేహం లేదు.