హమ్మయ్య..ఫైనల్లీ టీమిండియా ఐసిసి ఛాంపియన్ ట్రోఫీని గెలిచేస్తుంది . ఛాంపియన్స్ ట్రోఫీని ముద్దాడింది . ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ ని చిత్తుచిత్తుగా ఓడించేసి ఇటు బ్యాట్స్ మెన్స్ ని అటు బౌలర్స్ ని కట్టడి  చేసేసింది . న్యూజిలాండ్ పై 4 వికెట్ల తేడాతో ఇండియా ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ ని చిత్తు చిత్తు చేసి మరి మూడోసారి టైటిల్ కైవసం చేసుకుంది . దానికి సంబంధించిన పిక్చర్స్ వీడియోస్  ఇప్పుడు దేశవ్యాప్తంగా టీమ్ ఇండియా ని పొగిడేస్తున్నారు అభిమానులు జనాలు .


మరీ ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అదే విధంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పెషల్ గా టీమిండియా కు విష్ చేయడం హైలైట్ గా మారింది . ఇదే మూమెంట్లో ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్న ఇండియన్ క్రికెటర్స్ కు అసలు ఎంత మనీ వస్తుంది అనేది  హాట్ టాపిక్ గా మారింది.  ఛాంపియన్స్ టీమ్ ఇండియాకు టైటిల్ తో పాటు దాదాపు 19. 48 కోట్ల ప్రైస్ మనీ దక్కింది . అంతేనా ప్రతి గ్రూప్ దశలో నెగ్గిన ప్రతి మ్యాచ్ కి  దాదాపు 30 లక్షలు ఐసిసి అందజేస్తుంది .



అలా మూడు గ్రూపు మ్యాచ్ లోను భారత్ నెగ్గింది . దీంతో ప్రైజ్ మనీ కాకుండా అదనంగా భారత్ కి 90 లక్షలకు పైగానే అందింది. అంతేకాకుండా న్యూజిలాండ్ 9.74 కోట్లు అందుకుంది . సెమీఫైనల్స్ లో ఓటమి పాలైన ఆస్ట్రేలియాకు అదే విధంగా సౌత్ ఆఫ్రికాకు 4.87 కోట్లు దక్కింది . కాగా 5 , 6 స్థానాలలో నిలిచిన ఆఫ్గన్ , బాంగ్లాదేశ్ కు చరో 3.4 కోట్లు దక్కింది . ఇక 7 , 8 స్థానాలలో నిలిచిన పాకిస్తాన్.. ఇంగ్లాండ్ కు దాదాపు 1.2 కోట్లు లభించాయి.. దేశవ్యాప్తంగా టీమిండియా సాధించిన ఈ ఘనత గురించి మాట్లాడుకుంటున్నారు . మరీ ముఖ్యంగా రోహిత్ శర్మ కెప్టెన్సీ లో ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ రావడం గర్వకారణం అంటూ రోహిత్ శర్మ ఫ్యాన్స్ ఓ రేంజ్ పొగిడేస్తున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: