
మరీ ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ ప్రతి బాల్ ని ఫోర్ గా.. సిక్సులుగా మార్చేసి స్కోర్ బోర్డ్ ముందుకు వెళ్లడానికి తన వంతు సహాయం చేసాడు . ఆ తర్వాత ఎవ్వరు ఊహించని విధంగా గిల్ అవుట్ అవ్వడం .. వెంటనే వచ్చిన విరాట్ ఒక పరుగుకే అవుట్ అవ్వడం ..టీమిండియా ఫ్యాన్స్ ని నిరాశకు గురి చేసింది . కానీ ఆ తర్వాత వచ్చిన శ్రేయస్ అయ్యార్ - అక్షర్ పటేల్ బాగా స్కోర్ బోర్డ్ ను ముందుకు తీసుకెళ్లే విధంగా చేశారు . ఆ తర్వాత 180 పరుగుల వద్దకు చేరుకుంది .
అదే మూమెంట్లో శ్రేయ్యాస్ 48 వద్ద క్యాచ్ తో అవుట్ అయిపోతాడు. ఆ తర్వాత రాహుల్ - హార్దిక్ పాండ్యా హిట్టింగ్ చేయడానికి ప్రయత్నిస్తారు . ఆ టైం లో హార్ధిక్ అవుట్ అవుతాడు. ఆ తర్వాత రంగంలోకి దిగిన జడేజా బాగా రాహుల్ కి సపోర్ట్ చేసి స్కోర్ ని ముందుకు తీసుకెళ్లే విధంగా చేస్తాడు. అంతేకాదు విన్నింగ్ షాట్ తీసి ఇండియన్ ఫాన్స్ కి ఫుల్ గూస్ బంప్స్ తెప్పించాడు . ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచే విధంగా మార్చేసాడు. కాగా విన్నింగ్ షాట్ కొట్టిన తర్వాత జడేజా ఆనందంలో గంతులు వేస్తూ పుష్ప సినిమాలో "పుష్ప అంటే పేరు అనుకుంటివా .. అది ఓ బ్రాండ్" అంటూ వీపును తట్టే సీన్ ని రీ క్రియేట్ చేసిన విధంగా జడేజా "బ్యాట్ తో జడేజా అని తన జెర్సీపై ఉన్న పేరుని చూపిస్తూ పుష్ప2 సినిమాలో పుష్ప రాజ్ స్టైల్ లో జడేజా అంటే ఒక బ్రాండ్ " అనే విధంగా చూపిస్తాడు . అది గ్రౌండ్లో ఉన్న ఆడియన్స్ కు టీవీలో ఆ సీన్ చూస్తున్న జనాలకు బాగా నచ్చేసింది . ప్రెసెంట్ ఈ వీడియోని ఎక్కువగా ట్రెండ్ చేస్తున్నారు అల్లు అర్జున్ అభిమానులు..!