భారత్ క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుత బ్యాటింగ్ , భారీ సిక్సర్లతో భారత జట్టు న్యూజిలాండ్ పై నాలుగు వికెట్ల తేడాతో ఓడించింది .. రికార్డు స్థాయిలో మూడోసారి ఛాంపియన్ ట్రోపీని తమ ఖాతాలో వేసుకుంది. ఇక ఈ మ్యాచ్ కు ముందు రోహిత్ శర్మ రిటైర్మెంట్ పై పెద్ద ఎత్తున వార్తలు కూడా వచ్చాయి .. రోహిత్ గత కొంతకాలంగా ఫామ్ లో లేకపోవడం దీనికి ప్రధాన కారణం . అయితే చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో రోహిత్ తన సత్తా చాటుతూ టాప్ స్కోరర్ గా నిలిచి విమర్శకులకు గట్టి సమాధానం ఇచ్చాడు .  అలాగే హిట్ మాన్ నాయకత్వంలో భారత జట్టు 2024 లో టి20 వరల్డ్ కప్ ని కూడా గెలుచుకొని ఇప్పుడు మరోసారి ఐసీసీ ట్రోపీని అందుకుంది.
 

టీమిండియా 2002, 13 తర్వాత మూడోసారి ఈ టైటిల్ను గెలుచుకుంది .. అదే విధంగా చాంపియన్స్ ట్రోపీ చరిత్రలో మూడుసార్లు విజేతగా నిలిచిన తొలి జట్టుగా భారత్ అరుదైన రికార్డును క్రియేట్ చేసింది . అయితే ఈ ఘనవిజయం భారత్ కు భారీ ప్రైజ్ మనీని కూడా తెచ్చి పెట్టింది .. భారత జట్టు 2.4 మిలియన్ డాలర్లు (అంటే 19.5 కోట్లు) ప్రైస్ మనీ ని గెలుచుకుంది .. ఐసీసీ గతంలో కంటే ఈసారి ప్రైజ్ మనీని 53% పెంచింది .. అలాగే రనర్స్ గా నిలిచిన న్యూజిలాండ్ కు 1.12 మిలియన్ డాలర్లు (అంటే 9.72 కోట్లు) ప్రైజ్ మనీ వచ్చాయి.. సెమీఫైనల్ లో ఎలిమినేట్ అయిన ఆస్ట్రేలియా , దక్షిణాఫ్రికా టీమ్‌లకు కూడా నాలుగు కోట్ల వరకు వచ్చాయి ..

 

అలాగే ఈసారి ఐసిసి ఛాంపియన్ ట్రోఫీ ప్రైజ్ మనీ మొత్తం 6.9 మిలియన్ డాలర్లు (అంటే దాదాపు 60 కోట్ల) గా నిర్ణయించింది .. గ్రూప్ దశలో గెలిచిన జ‌ట్లకు 30 లక్షలు ప్రైజ్ మనీ ఇవ్వబోతున్నారు . అలాగే ఐదు , ఆరు స్థానంలో నిలిచిన టీమ్లకు మూడు కోట్లు 7,  8 స్థానాలు నిలిచిన టీమ్లకు 1.2 కోట్లు ప్రైస్ గా రానున్నాయి .. ఇక ఐసీసీ టోర్నీలో పాల్గొన్న 8 టీమ్స్ కు 1.08 కోట్లు అందబోతున్నాయి .. ఇక టీమిండియా ఈ విజయంతో ప్రపంచ క్రికెట్లో తన ఆధిపత్యాన్ని మరోసారి చూపించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: