
దీంతో ఈ జంటతో మా ఆనందాన్ని ఇలా అభిమానులతో పంచుకోవడంతో ఈ జంట మరింత ఆనందాన్ని కలిగించినట్లుగా కనిపిస్తోంది.వినేశ్ ఫోగట్ గత ఏడాది పతాక శీర్షికలో పాల్గొని ప్యారిస్ ఒలంపిక్స్ లో ఫైనల్ వరకు చేరుకుంది. అయితే ఈమె పైన అనూహ్య రీతిలో ఆఖరి నిమిషంలో వేటుపడిన విషయం తెలిసిందే.నిర్ణీత బరువు కంటే ఒక 100 గ్రాములు అదనంగా ఉండడం వల్ల ఈమెను అనర్హులుగా ప్రకటించారు. దీంతో రేజింగ్ లో తొలి స్వర్ణం వస్తుందనుకున్న భారతీయులకు నిరాశ మిగిలింది. దీనిపైన చాలామంది విమర్శలు కూడా చేశారు.
ఈ క్రమంలోనే ఐవోఎస్ కోర్ట్ ఆఫ్ అర్బట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ అనే ఒక కోర్టులో కూడా అప్పీల్ చేసిన కూడా అక్కడ కూడా నిరాశ మిగిలిందట. అంతర్జాతీయ స్థాయిలో పోటీపడే క్రీడాకారులకు సైతం కచ్చితంగా నిబంధనలను పూర్తిగా తెలుసుకోవాలి అని ఆ కేసును కూడా కొట్టేసిందట. తొలిరోజు పోటీలలో నిర్ణీత బరువుతో పోటీపడి మరి గెలిచినందుకు గాను రజక పతాకం ఇవ్వాలని వినేశ్ ఫోగట్ న్యాయ పోరాటం చేసిన సరైన ఫలితం రాలేదట. దీంతో పతకం లేకుండానే దేశానికి తిరిగి రావడం జరిగింది ఈమె. ఒలంపిక్స్ ఫైనల్స్ వరకు చేరిన మొదటి మహిళా రేజర్ గా చరిత్రలో నిలిచిపోయింది ఈమె. దీంతో అనంతరం స్పోర్ట్స్ కి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరి హర్యానాలోని ఒక నియోజకవర్గంలో నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచింది. 2018లో ప్రముఖ క్రీడాకారుడైన సోమ్ వీర్ ని ప్రేమించి వివాహం చేసుకుంది. ఇప్పుడు తాజాగా తల్లి కాబోతున్న విషయాన్ని ప్రకటించింది వినేశ్ ఫోగట్.