రోహిత్ శర్మ ఫ్యాన్స్‌కు పండగే. ఎందుకంటే 2027 వరకూ అతడి బ్యాట్ తో మోత మోగించబోతున్నాడు. సౌతాఫ్రికా గడ్డపై జరిగే వన్డే వరల్డ్ కప్ వరకూ రోహిత్ క్రికెట్ ఆడతాడని తేలిపోయింది. టెస్టుల నుంచి కూడా ఇప్పట్లో రిటైర్మెంట్ లేనట్టే.

ఫిట్‌నెస్, ఫామ్ రెండూ పర్ఫెక్ట్‌గా ఉండాలని రోహిత్ ప్లాన్ చేస్తున్నాడు. అందుకే, టీమిండియా అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్‌తో కలిసి స్పెషల్ ట్రైనింగ్ షురూ చేశాడు. నాయర్ గతంలో చాలా మంది ప్లేయర్లకు మెళకువలు నేర్పి సక్సెస్ బాట పట్టించాడు. కేఎల్ రాహుల్, దినేష్ కార్తీక్ లాంటి వాళ్లు కూడా నాయర్ దగ్గర శిక్షణ తీసుకున్నవాళ్లే. తన సక్సెస్‌లో నాయర్ పాత్ర కూడా ఉందని రోహిత్ ఇదివరకే చెప్పాడు. అయితే, రోహిత్ కెరీర్ మాత్రం ఐపీఎల్ 2025లో తన ఆటతీరుపైనే ఆధారపడి ఉంటుంది.

నిజానికి, రోహిత్ అంతర్జాతీయ కెరీర్ విషయంలో కొన్నాళ్లుగా చాలా డౌట్స్ ఉన్నాయి. 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు అయితే, రోహిత్ ఇక ఆపేస్తాడేమో అని చాలా మంది అనుకున్నారు. ఎందుకంటే అప్పటికి అతడికి 37 ఏళ్లు. t20 వరల్డ్ కప్ 2024 తర్వాత T20లకు గుడ్ బై చెప్పేశాడు. ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలోనూ ఒక టెస్టులో తనే డ్రాప్ అయ్యాడు. తన ఆట సరిగ్గా లేదని ఒప్పుకున్నాడు కూడా. 40 ఏళ్ల వయసులో వరల్డ్ కప్ ఆడటం అంటే మాటలు కాదు. దీంతో రోహిత్ ఫ్యూచర్ ఏంటనే ప్రశ్నలు ఎక్కువయ్యాయి.

కానీ సీన్ ఒక్కసారిగా మారిపోయింది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్‌పై ఇండియా దుమ్మురేపింది. ఆ మ్యాచ్‌లో రోహిత్ 76 రన్స్ తో మాస్టర్ క్లాస్ ఇన్నింగ్స్ ఆడాడు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కొట్టేశాడు. రెండు ఐసీసీ ట్రోఫీలు గెలిచిన రెండో ఇండియన్ కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు.

ఫైనల్ మ్యాచ్ అయిపోయాక రోహిత్ క్లారిటీ ఇచ్చేశాడు. రిటైర్మెంట్ ఆలోచనలే లేవని తెగేసి చెప్పాడు. సంబరాల్లో ఉండగా విరాట్ కోహ్లీకి కూడా గట్టిగా చెప్పాడు.. "నేను రిటైర్ అవ్వట్లేదు" అని. అంతేకాదు, 2027 వరల్డ్ కప్ వరకూ ఆడే ఆలోచనలు ఉన్నాయని కూడా చెప్పేశాడు.

ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ కూడా రోహిత్ విషయంలో ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు. రోహిత్‌కు వన్డేల్లో ఇంకా 'అన్‌ఫినిష్డ్ బిజినెస్' ఉందని అంటున్నాడు. లాస్ట్ వన్డే వరల్డ్ కప్‌లో ఓడిపోవడం రోహిత్‌ను ఇంకా కసిగా ఆడేలా చేస్తుందని పాంటింగ్ అంచనా వేస్తున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో రోహిత్ ఆడిన ఇన్నింగ్సే అతడి సత్తా ఏంటో చూపిస్తోందని కూడా పాంటింగ్ మెచ్చుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: