
రెవ్‌స్పోర్ట్జ్ తో మాట్లాడుతూ పుజారా ఒక క్లారిటీ ఇచ్చాడు. టీమ్ నన్ను కావాలనుకుంటే నేను ఆడటానికి రెడీగా ఉన్నానని చెప్పాడు. గత కొన్నేళ్లుగా డొమెస్టిక్ క్రికెట్, కౌంటీ క్రికెట్‌లో దుమ్మురేపుతున్నానని గుర్తు చేశాడు. "ఒక క్రికెటర్‌గా ఎప్పుడూ దేశం కోసం ఆడాలని ఉంటుంది. నేను సక్సెస్ కోసం నా వంతు ప్రయత్నాలు చేస్తున్నా. టీమ్‌కు నేను అవసరమైతే, వెంటనే వచ్చేస్తా. డొమెస్టిక్ క్రికెట్ రెగ్యులర్‌గా ఆడుతున్నా. కౌంటీ క్రికెట్ కూడా ఆడుతున్నా. పరుగుల వరద పారిస్తున్నా. ఒక్క ఛాన్స్ ఇస్తే చాలు, రెండు చేతులా ఒడిసిపట్టుకుంటా" అని అన్నాడు పుజారా.
2023లో ఆస్ట్రేలియాతో WTC ఫైనల్‌లో పుజారా లాస్ట్ మ్యాచ్ ఆడాడు. 2024 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి అతన్ని తీసుకోలేదు. కానీ పుజారా మాత్రం ఒక బాంబ్ పేల్చాడు. "నేను టీమ్‌లో ఉంటే, ఆ సిరీస్ మనం గెలిచేవాళ్లం. ఆస్ట్రేలియాలో వరుసగా మూడు సిరీస్‌లు కొట్టేవాళ్లం. అది మాత్రం గ్యారెంటీ" అని ధీమాగా చెప్పాడు.
ఇంగ్లాండ్ టూర్ గురించి పుజారా మాట్లాడుతూ.. అక్కడ గెలవడం అంత ఈజీ కాదు అన్నాడు. కానీ ఈసారి మాత్రం మనకు మంచి ఛాన్స్ ఉందని అంటున్నాడు. ఎందుకంటే ఇంగ్లాండ్ బౌలింగ్ వీక్ అయిపోయిందట. "జేమ్స్ అండర్సన్ రిటైర్ అయ్యాడు. స్టూవర్ట్ బ్రాడ్ కూడా టీమ్‌లో లేడు. అందుకే ఈసారి మనకు తిరుగులేదు" అని పుజారా కాన్ఫిడెంట్‌గా చెప్పాడు.
భారత్ మళ్లీ గెలవాలని చూస్తోంది. ఈ టైమ్‌లో పుజారా డొమెస్టిక్ క్రికెట్‌లో ఆడుతున్న విధ్వంసం చూస్తే, సెలెక్టర్లు మళ్లీ పుజారా గురించి ఆలోచించక తప్పదు. మరి సమీప భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూడాలి అని మాత్రం క్రికెట్లో చూడాలని ఫాన్స్ మాత్రం ఆశిస్తున్నారు.