
ఇటీవలే ప్రముఖ క్రికెటర్ తో హోలీ ఆడినట్లుగా బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ ఒక ఫోటోను AI తో జనరేట్ చేయడం జరిగింది.ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఐపీఎల్ లో కోల్కత్తా నైట్ రైడర్స్ జట్టుకి సహిజమానిగా ఉన్నారు షారుక్ ఖాన్.. ఇదే టీమ్ లో గత కొన్ని ఏళ్లుగా ఆడుతున్న రింకూ సింగ్ తన ఆటతో బాగా ఆకట్టుకుంటూ ఉన్నారు. త్వరలోనే ఐపిఎల్ 18 వ సీజన్ మొదలు కాబోతూ ఉండడంతో చాలామంది ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు.
ఈ క్రమంలోనే హోలీ సందర్భంగా కేకేఆర్ జట్టు సభ్యులతో కలిసి ఈ హోలిని రింకూ సింగ్ చాలా గ్రాండ్గా జరుపుకున్నారట. ఈ సమయంలోనే షారుక్ ఖాన్ కూతురు సుహాన ఖాన్ తో కలిసి బీచ్ లో రింకూ హోలీ ఆడినట్లుగా AI తో కొన్ని ఫోటోలను జనరేట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఈ ఫోటోలు చూసిన వారందరూ మొదట ఆశ్చర్యపోయిన ఆ తర్వాత ఇది ఏఐ అని తెలిసి తీవ్ర ఆగ్రహాన్ని తెలియజేస్తూ ఉన్నారు. ఇలా ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలకు సంబంధించి ఏఐని ఉపయోగించి చేస్తూ ఉండడంతో ఫైర్ అవుతున్నారు. ఇలా అయితే రాబోయే రోజుల్లో వాళ్ళ ప్రవేశికి ఇబ్బందులు కలిగించేలా ఉన్నాయంటూ కామెంట్స్ చేస్తున్నారు.