
ముఖ్యంగా బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ ఈ ఓపెనింగ్ సెర్మనీలో మెయిన్ అట్రాక్షన్ కానుంది. ‘స్త్రీ 2’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో ఫుల్ జోష్‌లో ఉన్న శ్రద్ధ, తన డ్యాన్స్‌లతో స్టేజ్‌ను షేక్ చేయడానికి రెడీ అవుతోంది. అంతేకాదు, యంగ్ హీరో వరుణ్ ధావన్ కూడా శ్రద్ధా కపూర్‌తో కలిసి సందడి చేయనున్నాడు. వరుణ్ ధావన్ ‘స్త్రీ 2’ సినిమాలో మెరుపులా మెరిసిన సంగతి తెలిసిందే. రీసెంట్‌గా ‘బేబీ జాన్’ సినిమాతో వచ్చినా, ఆ మూవీ బాక్సాఫీస్ దగ్గర అనుకున్నంతగా ఆడలేదు. కానీ వరుణ్ మాత్రం ఎనర్జీకి కేరాఫ్ అడ్రస్. శ్రద్ధా కపూర్, వరుణ్ ధావన్ కలిసి వేదికపై దుమ్ము రేపడం ఖాయం అంటున్నారు.
మ్యూజికల్ ట్రీట్ కోసం ఎదురు చూసేవాళ్లకు అరిజిత్ సింగ్ ఉండనే ఉన్నాడు. తన మెస్మరైజింగ్ వాయిస్‌తో అందరినీ మంత్రముగ్ధుల్ని చేసే అరిజిత్ సింగ్.. ఐపీఎల్ ఓపెనింగ్ సెర్మనీలో తన సూపర్ హిట్ పాటలతో హోరెత్తించనున్నాడు. రీసెంట్‌గా బ్రిటీష్ సింగర్ ఎడ్ షీరన్ ఇండియాకు వచ్చినప్పుడు, అరిజిత్ సింగ్ అతనితో కలిసి తెగ సందడి చేశాడు. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
గత ఐపీఎల్ ఓపెనింగ్ సెర్మనీ కూడా ఓ రేంజ్‌లో జరిగింది. సింగర్ సోను నిగమ్, బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్, లెజెండరీ మ్యూజిక్ కంపోజర్ ఏ.ఆర్. రెహమాన్ లాంటి స్టార్స్ అప్పుడు స్టేజ్‌పై అదరగొట్టారు. ఈసారి మాత్రం అంతకు మించి అనేలా ప్లాన్ చేస్తున్నారని టాక్.
క్రికెట్ విషయానికొస్తే, గత సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) టీమ్‌ను ఫైనల్‌లో చిత్తు చేసి కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) ఛాంపియన్‌గా నిలిచింది. శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీలో KKR టీమ్ మూడోసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది.