
అయితే ఇప్పటికే చాహల్ ధనుశ్రీకి 2.37 కోట్ల రూపాయలు అందించినట్లు తెలుస్తోంది.అయితే మిగిలిన మొత్తాన్ని చెల్లించడానికి కొంత మేరకు టైం అడిగినట్లుగా తెలియజేశారు. చాహల్, ధనశ్రీ 2020 డిసెంబర్ 22న వివాహం చేసుకోవడం జరిగింది.అయితే గత మూడు సంవత్సరాలుగా వీరిద్దరూ విడిగానే ఉంటున్నారట. అయితే వివాహమైన ఏడాదికే ఈ జంట విడిపోయినట్లు పిటిషన్ లో తెలియజేశారు. అయితే ఈ విషయం విన్న అభిమానులు చాలా ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యంగా ధనశ్రీ తనకు కావలసిన ఫేమ్ కోసమే చాహల్ ను వివాహం చేసుకుందని కొంతమంది కామెంట్ చేస్తూ ఉన్నారు.
ఈ ఏడాది ఫిబ్రవరి 5వ తేదీన వీరిద్దరు విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టును కూడా ఆశ్రయించారట. హిందూ వివాహ చట్టం ప్రకారం ఆరు నెలల పాటు వీరికి వీరికి సమయాన్ని ఇచ్చినప్పటికీ వీరిద్దరూ మారకపోవడంతో పాటుగా ఐపీఎల్ కారణంగా తనకు మూడు నెలల పాటు ప్రస్తుతం తాను అందుబాటులో ఉండలేనంటూ చాహల్ వెల్లడించారట. దింతో తీర్పు కూడా హైకోర్టు నిన్నటి రోజునే తెలియజేసింది. మొత్తానికి గత కొంతకాలంగా వస్తున్న రూమర్స్ కు ఎట్టకేలకు నిన్నటి రోజున ఎండ్ కార్డు పడిందని చెప్పవచ్చు. మరి రాబోయే రోజుల్లో చాహల్ ఎవరిని వివాహం చేసుకుంటారో చూడాలి