మన దేశంలో క్రికెట్ ఆటకు ఏ స్థాయి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దేశంలో ఎన్నో ఆటలు ఉన్నా కూడా క్రికెట్ ఆడే వారి సంఖ్య అత్యధికంగా ఉంటుంది. అలాగే చూసే వారి సంఖ్య కూడా అదే స్థాయిలో ఉంటుంది. ఇక ఇండియా పురుషుల మరియు మహిళల జట్టు ఎక్కడ క్రికెట్ మ్యాచ్ ఆడినా కూడా దానిని చూడడానికి అనేక మంది భారతీయులు ఇతర దేశాలకు కూడా వెళుతుంటారు. ఇక మన దేశంలో కనుక టీమిండియా కు సంబంధించిన పురుషుల , మహిళల మ్యాచులు ఏదైనా ప్రాంతంలో జరిగితే స్టేడియాలు నిండిపోయి రేంజ్ లో జనాలు రావడం , టికెట్లు సరిపోక అనేక మంది వెనక్కు తిరిగి వెళ్లిపోవడం జరుగుతూ ఉంటుంది.

ఇకపోతే గుజరాత్ తో ఇప్పటి వరకు ప్రపంచం లోనే ఎక్కడా లేని అత్యధిక మంది చూసే స్థాయి క్రికెట్ స్టేడియాన్ని నిర్మించాలి అనే ఒక ప్రతిపాదన వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇలా గుజరాత్ తో భారీ స్టేడియం ను నిర్మించాలి అనే ప్రతిపాదన వచ్చిన తర్వాత అమరావతిలో అంతకుమించిన జనాలు కూర్చునే కెపాసిటీ కలిగిన క్రికెట్ స్టేడియంను నిర్మించాలి అని ఐసిసి , బీసీసీఐ ఒక ప్రతిపాదనకు వచ్చినట్లు , దానికి తెలుగు దేశం పార్టీ కూడా సానుకూలంగా ఉన్నట్లు , ఒక వేళ అన్ని కుదిరితే భారతదేశం లోనే అత్యధిక మంది వీక్షించే కెపాసిటీ కలిగిన క్రికెట్ స్టేడియంను అమరావతిలో నిర్మించడానికి ఐసిసి , బీసీసీఐ మరియు కేంద్రం సానుకూలంగా ఉంటే దానికి కావలసిన స్థలాన్ని మంజూరు చేయడానికి కూడా తెలుగుదేశం ప్రభుత్వం రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది.

మరి గుజరాత్ లో నిర్మించడానికి రెడీ అవుతున్న దాని కంటే పెద్ద స్థాయి కెపాసిటీ కలిగిన క్రికెట్ స్టేడియంను అమరావతిలో నిర్మించడం జరుగుతుందా లేదా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: