
ధోనీ మాట్లాడుతూ"ఈ రూల్ పెట్టినప్పుడు నాకైతే ఇది అవసరమా అనిపించింది. నిజం చెప్పాలంటే నాకు నచ్చలేదు. కొన్నిసార్లు ఇది నాకు హెల్ప్ చేస్తుంది, కానీ కొన్నిసార్లు కాదు. నేను వికెట్ కీపింగ్ చేస్తూ మ్యాచ్ మొత్తం ఆడుతూనే ఉంటాను కాబట్టి నన్ను ఇంపాక్ట్ ప్లేయర్ గా తీసుకోలేరు కదా" అని జియో స్టార్ తో మాట్లాడుతూ తన మనసులో మాట బయటపెట్టాడు.
ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఐపీఎల్ గేమ్ ని పూర్తిగా మార్చేసింది. ఇప్పుడు మ్యాచ్ లు చూస్తే.. 200, 250 స్కోర్లు మామూలైపోయాయి. అందరూ బ్యాటింగ్ కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. టీమ్ లో ఒక ఎక్స్‌ట్రా బ్యాట్స్ మన్ ఉండటంతో బ్యాటర్లు కూడా ఫుల్ ఫ్రీడమ్ తో ఆడేస్తున్నారు. 200 కొట్టినా సేఫ్ కాదు అనే పరిస్థితి వచ్చేసింది.
అయితే ధోనీ మాత్రం ఈ భారీ స్కోర్లకు కారణం ఒక్క ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ మాత్రమే కాదు అంటున్నాడు. ప్లేయర్ల మైండ్ సెట్ మారిపోయింది, అందుకే ఇలా ఆడుతున్నారని అంటున్నాడు. "చాలా మంది ఈ రూల్ వల్లే స్కోర్లు పెరిగిపోతున్నాయని అంటున్నారు. కానీ నాకనిపిస్తే పిచ్ కండిషన్స్, ప్లేయర్ల కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా కారణం. ఎక్స్‌ట్రా బ్యాట్స్ మన్ ఉన్నాడనే ధైర్యంతోనే బ్యాటర్లు భయం లేకుండా ఆడుతున్నారు. టీమ్స్ ఐదుగురు, ఆరుగురు ఎక్స్‌ట్రా బ్యాటర్లను వాడట్లేదు కానీ, ఆ సెక్యూరిటీ ఫీలింగ్ మాత్రం వాళ్ల ఆటతీరుని మార్చేస్తోంది. టీ20 క్రికెట్ ఇలాగే మారిపోయింది" అని ధోనీ తన అనాలిసిస్ చెప్పాడు.
మొత్తానికి ధోనీ కామెంట్స్ చూస్తే.. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ గేమ్ ని మార్చింది నిజమే కానీ, ఆటగాళ్ల భయం లేని ఆటతీరు వల్లే అసలు మ్యాజిక్ జరుగుతోందని చెప్పొచ్చు.