
అశుతోష్ శర్మ మధ్యప్రదేశ్ లోని రత్లామ్ అనే ఓ చిన్న గ్రామం నుంచి వచ్చాడు .. సెప్టెంబర్ 15 1998 లో జన్మించాడు.. పవర్ హిట్లర్ ను చూసి క్రికెటర్ నేర్చుకున్నాడు .. 2023 లో సయ్యద్ ముష్టాక్ అలీ ట్రోఫీలో అరుణాచల ప్రదేశ్ తో 11 బంతుల్లో 50 చేసి యువరాజ్ సింగ్ రికార్డును బద్దలు కొట్టాడు .. ఇక ఇది భారత క్రికెట్ లోనే అత్యంత వేగవంతమైన టి20 ఆఫ్ సెంచరీ. ఇక మొదట మిడిల్ ఆర్డర్లో ఆడిన తర్వాత ధోని , రింకు సింగ్ ల ఫినిషర్ గా మారాడు .. గత సంవత్సరం పంజాబ్ కింగ్స్ ఇతన్ని 20 లక్షలకు కొనుక్కుంది .. అక్కడ 7 ఇన్నింగ్స్ లో 189 పరుగులు చేసి (167.25 స్ట్రైక్ రేట్ ) సాధించాడు .. అలాగే 2025 లో ఢిల్లీ క్యాపిటల్స్ 3.8 కోట్లకు ఈ ప్లేయర్ ను దక్కించుకుంది .. శిఖర్ ధావన్ ఇతనికి మార్గదర్శి .. ఈ విజయం తన మార్గదర్శకుడికి అంకితం ఇచ్చాడు .
ఈ స్టార్ ప్లేయర్ టాప్ ఇన్నింగ్స్ ఇవే :
1. (IPL 2025, మార్చి 23, 2025) 66 పరుగులు – 31 బంతులు vs లక్నో
– 210 చేజ్, 65/5 నుంచి గెలిపించాడు.
– 5 ఫోర్లు, 5 సిక్స్‌లు, SR 212.90.
2. (IPL 2024) 61 పరుగులు – 28 బంతులు పంజాబ్ vs ముంబై
– 183 చేజ్, 9 పరుగుల తేడాతో ఓడారు.
– 77/6 నుంచి దాదాపు గెలిపించాడు.
3. (SMAT 2023) 50 పరుగులు – కేవలం 11 బంతులు vs అరుణాచల్
– భారత వేగవంతమైన t20 ఫిఫ్టీ.
– SR 454.54 ఇక్కడే తనకోసం ఎక్కువ తెలిసింది.
4. (IPL 2024) 33 పరుగులు – 15 బంతులు vs హైదరాబాద్
– 182 చేజ్, 2 పరుగుల తేడాతో ఓడారు.
– చివర్లో వేగంగా ఆడాడు.
5. 31 – 17 బంతులు vs గుజరాత్ (IPL 2024)
– PBKS 200 చేసింది, అతని కాంట్రిబ్యూషన్ ఉపయోగపడింది.
– SR 182.35.
ప్రస్తుత ఢిల్లీ మ్యాచ్ విజయంతో నెక్స్ట్ మ్యాచ్ లలో తనపై మరిన్ని అంచనాలు పెంచేశాడు . ఇదే ఫామ్ ని కానీ కొనసాగితే వచ్చే ఐపీఎల్ లో తనకి రికార్డు ధర పలికిన ఎలాంటి ఆశ్చర్యం లేదు.