
మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ ఫస్ట్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దాంతో ముకేష్ కుమార్ బౌలింగ్‌కు దిగాడు. అయితే కేవలం రెండు ఓవర్లే వేసినా ఏకంగా 22 పరుగులు ఇచ్చేశాడు. ఎకానమీ రేటు అక్షరాలా 11. అయితే ఒక్క వికెట్ మాత్రం తీశాడు. విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగిపోయిన మిచెల్ మార్ష్‌ను ఔట్ చేసినా పరుగులైతే భారీగా ఇచ్చేశాడు. దీంతోనే ముకేష్ కుమార్ పేరు చరిత్రలో చెత్తగా నిలిచిపోయింది.
ఐపీఎల్ హిస్టరీలో కనీసం 300 బంతులు వేసిన బౌలర్లలో ముకేష్ కుమార్ ఇప్పుడు అత్యంత చెత్త ఎకానమీ రేటు కలిగిన బౌలర్‌గా నిలిచాడు. స్పోర్ట్‌స్టార్ కథనం ప్రకారం, 2023లో లక్నోతో జరిగిన మ్యాచ్ ద్వారా ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ముకేష్.. ఇప్పటివరకు 21 ఇన్నింగ్స్‌ల్లో 411 బంతులు వేశాడు. అతని కెరీర్ ఎకానమీ రేటు 10.45గా ఉంది. పంజాబ్ కింగ్స్ బౌలర్లు యశ్ ఠాకూర్ (10.26), కార్తీక్ త్యాగి (10.23) పేర్లను కూడా వెనక్కి నెట్టి ముకేష్ కుమార్ టాప్ ప్లేస్‌లో నిలవడం నిజంగా షాకింగ్.
మ్యాచ్ విషయానికొస్తే లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటింగ్ విధ్వంసం సృష్టించింది. 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 209 పరుగుల భారీ స్కోరు చేసింది. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ ఏ మాత్రం తగ్గలేదు. చివరి వరకు పోరాడింది. యంగ్ ప్లేయర్ అశుతోష్ శర్మ అజేయంగా 66 పరుగులు చేయడంతో నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగిన మ్యాచ్‌లో ఢిల్లీ టీమ్ ఒక్క వికెట్ తేడాతో గెలుపొందింది.
అయితే మ్యాచ్‌లో గెలిచినా ఢిల్లీ క్యాపిటల్స్‌కు మరో షాక్ తగిలింది. ముకేష్ కుమార్ గాయపడటం అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది. లక్నో ఇన్నింగ్స్ 15వ ఓవర్‌లో నికోలస్ పూరన్ డీప్ బ్యాక్‌వర్డ్ స్క్వేర్ లెగ్‌లో షాట్ ఆడాడు. బంతిని ఆపేందుకు ముకేష్ కుమార్ వేగంగా పరిగెత్తాడు. అయితే కాలు బెణకడంతో అక్కడే కూలబడిపోయాడు. బాధతో విలవిల్లాడుతూ కనిపించాడు. ఫిజియో వచ్చి పరీక్షించినా నొప్పి తగ్గకపోవడంతో మైదానం వీడి వెళ్ళిపోయాడు. ముకేష్ కుమార్ గాయం తీవ్రతపై DC ఇంకా ఎలాంటి అప్‌డేట్ ఇవ్వలేదు. ఒకవేళ గాయం సీరియస్‌గా ఉంటే మాత్రం ఢిల్లీ టీమ్‌తో పాటు ముకేష్ కెరీర్‌కు కూడా పెద్ద దెబ్బ తగిలే ప్రమాదం ఉంది