ప్రపంచంలోనే అతి పెద్ద స్టేడియం అనగానే అందరికీ గుర్తొచ్చేది  అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం. అవును... అదే వేదిక ప్రస్తుతం IPL 2025కి వేదిక అయింది. ఆ వేదికపై తాజా మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం జరిగింది. దీంతో పంజాబ్ మొదటి బ్యాటింగ్‌కు దిగింది. కట్ చేస్తే, బ్యాటింగ్‌కు అనకూలిస్తున్న పిచ్‌‌పై పంజాబ్ బ్యాటర్లు చెలరేగి మరీ ఆడుతున్నారు. పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య ఈ సీజన్‌లో తొలి మ్యాచ్ జరుగుతుండడంతో హాట్ టాపిక్ అవుతోంది.

ప్రస్తుతం బ్యాటింగ్‌కు అనకూలిస్తున్న పిచ్‌‌పై పంజాబ్ బ్యాటర్లు చెలరేగి ఆడుతున్నట్టు సమాచారం. ఓపెనర్ ప్రభ్ సిమ్రాన్ సింగ్ (5) త్వరగానే ఔట్ అయినప్పటికీ, మరో ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య (23 బంతుల్లో 47) బాది అర్ధశతకాన్ని మిస్ చేసుకోవడం జరిగింది. ఇక జోరు మీదున్న ఆర్యను రషీద్ ఖాన్ గూగ్లీతో బోల్తా కొట్టించాడు. ఇది రషీద్ ఖాన్‌కు ఐపీఎల్‌లో 150వ వికెట్ కావడం కొసమెరుపు. ఇదే అతని అదిరిపోయే రికార్డ్ అని అంటూ విశ్లేషకులు అంటున్నారు.

విషయంలోకి వెళితే... వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ చేసే క్రమంలో 16 బంతుల్లో 28 కొట్టడం జరిగింది. మార్కస్ స్టోయినిస్ ప్రస్తుతం క్రీజులో ఉన్నాడు. దీంతో పంజాబ్ ప్రస్తుతం 11 ఓవర్లు ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 105 పరుగులు మాత్రమే చేసారు. గుజరాత్ ఫీల్డర్లు ఇప్పటికే 2 క్యాచ్‌లు వదిలేయడం పంజాబ్‌కు ఓ రకంగా కలిసి వస్తోంది అంటూ కామెంటర్లు చెబుతున్నారు. సాయి కిషోర్ తన వరుస బంతుల్లో ఒమర్జాయ్, గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ను అవుట్ చేసిన సంగతి తెలిసిందే. ఇంకా, పంజాబ్ బ్యాటింగ్ లైనప్‌లో శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్ వంటి హార్డ్ హిట్టర్లు బ్యాటింగ్ కోసం ఎదురు చూస్తున్నారు. వీళ్లను గుజరాత్ టైటాన్స్ టీమ్ కంట్రోల్ చేయలేకపోతే మాత్రం కష్టమేనని ప్రేక్షకులు గుసగుసలు ఆడుకుంటున్నారు. ప్రస్తుతానికి అయితే... పంజాబ్ 200 పరుగులు దాటడం అయితే ఖాయం అంటున్నారు క్రికెట్ పండితులు. మరి ఈ సదరు మ్యాచ్ పైన మీ అభిప్రాయం ఏమిటో కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: