
విడిపోవడానికి అసలు కారణం ఏంటనేది చాహల్ గానీ, ధనశ్రీ గానీ అఫీషియల్ గా చెప్పలేదు. కానీ సీనియర్ ఎంటర్‌టైన్‌మెంట్ జర్నలిస్ట్ విక్కీ లల్వానీ ప్రకారం, ఇద్దరి వ్యక్తిత్వాలు పూర్తిగా భిన్నం అట, పెళ్లయినప్పటి నుంచీ వాళ్ల మధ్య అసలు పొసగలేదని ఆయన కుండ బద్దలు కొట్టారు. ముఖ్యంగా, ధనశ్రీ ముంబైలో సెటిల్ అవ్వాలని కోరుకుంటే, చాహల్ మాత్రం హర్యానాలోని తన తల్లిదండ్రులను వదిలి వచ్చేదే లేదని పట్టుబట్టాడట.
2020, డిసెంబర్‌లో పెళ్లి చేసుకున్న తర్వాత, చాహల్, ధనశ్రీ.. హర్యానాలోనే చాహల్ తల్లిదండ్రులతో కలిసి ఉన్నారు. కేవలం అవసరం ఉంటే తప్ప ముంబైకి వచ్చేవారు కాదట. ఎక్కడ ఉండాలనే విషయంలో ఇద్దరి మధ్య ఉన్న ఈ భేదాభిప్రాయమే విడాకులకు అసలు కారణమని లల్వానీ గట్టిగా చెబుతున్నారు. చాహల్ తన ఫ్యామిలీని, సొంత ఇంటిని వదిలి రానని మొండికేయడంతో గొడవలు ముదిరాయని సమాచారం.
విడాకులు మంజూరైన రోజు చాహల్ వేసుకున్న టీ-షర్ట్ ఇప్పుడు వైరల్ అయింది. దానిపై "నీకు నువ్వే షుగర్ డాడీగా ఉండు" అని రాసి ఉండటం అందరినీ ఆశ్చర్యపరిచింది. మరోవైపు, విడాకుల సెటిల్‌మెంట్‌లో భాగంగా ధనశ్రీకి భరణంగా ఏకంగా రూ.4.75 కోట్లు అందనున్నాయని టాక్.
ట్విస్ట్ ఏంటంటే, సరిగ్గా విడాకులు మంజూరైన రోజే ధనశ్రీ "దేఖా జీ దేఖా మైనే" అనే పేరుతో ఒక పాటను విడుదల చేసింది. ఈ పాటలో ద్రోహం (మోసం), గృహ హింస వంటి అంశాలు ఉండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే, ఇది ఆమె వ్యక్తిగత అనుభవమా లేక కేవలం పాటలోని కథ మాత్రమేనా అనేది తెలియాల్సి ఉంది.
ఈ జంట 2022 జూన్ నుంచే వేరువేరుగా ఉంటున్నారని, చివరికి 2025 ఫిబ్రవరిలో విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారని, కూలింగ్ పీరియడ్ లేకుండా త్వరగా విడాకులు మంజూరు చేయాలని కోరారని తెలిసింది. చాహల్-ధనశ్రీ విడాకుల వెనుక అసలు కథ ఇదేనంటూ వినిపిస్తున్న మాటలు ఇవి. మరి దీనిపై వాళ్లిద్దరూ ఎప్పుడైనా స్పందిస్తారో లేదో చూడాలి.