
మ్యాచ్‌కు ముందు LSG కెప్టెన్ రిషబ్ పంత్ చాలా ధీమాగా మాట్లాడాడు. SRH ఎంత పెద్ద టార్గెట్ ఇచ్చినా ఛేజ్ చేసి తీరుతామని చెప్పాడు. అన్నట్టుగానే LSG టార్గెట్‌ను ఈజీగా ఛేదించింది. ఇక, ఈ మ్యాచ్ హీరో శార్దూల్ ఠాకూర్‌ను అసలు వేలంలో ఎవరూ కొనలేదు. తర్వాత LSG అతన్ని టీమ్‌లోకి తీసుకోవడం విశేషం. దీనిపై శార్దూల్ మాట్లాడుతూ.. తనకు ఐపీఎల్ కాంట్రాక్ట్ వస్తుందని అస్సలు ఊహించలేదని అన్నాడు.
"నన్ను తీసుకోకపోతే కౌంటీ క్రికెట్ ఆడదామనుకున్నా. కానీ రంజీ ట్రోఫీ సమయంలో జహీర్ ఖాన్ ఫోన్ చేసి, రీప్లేస్‌మెంట్‌గా తీసుకునే అవకాశం ఉందని, సిద్ధంగా ఉండమని చెప్పాడు" అని ఆసక్తికర విషయం బయటపెట్టాడు.
భారీ స్కోర్లు నమోదయ్యే మ్యాచ్‌లలో బౌలర్లు పడుతున్న కష్టాల గురించి కూడా శార్దూల్ మాట్లాడాడు. "ఇలాంటి పిచ్‌లపై బౌలర్లకు పెద్దగా సాయం దొరకడం లేదు. పైగా ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వచ్చాక, జట్లు 240-250 కొట్టేస్తుంటే బౌలర్లకు చాలా అన్యాయం జరుగుతోంది. పిచ్‌లు బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలి" అని తన అభిప్రాయం చెప్పాడు.
ఈ గెలుపుపై పంత్ స్పందిస్తూ.. "ఇది పెద్ద రిలీఫ్ ఇచ్చింది, కానీ మేమింకా మా అత్యుత్తమ ఆట ఆడలేదు. ఫలితాల గురించి కాకుండా, మా ఆటతీరును మెరుగుపర్చుకోవడంపైనే దృష్టి పెడతాం" అని అన్నాడు. శార్దూల్ ప్రదర్శనతో పాటు, యంగ్ బౌలర్ ప్రిన్స్ బౌలింగ్‌ను కూడా పంత్ ప్రశంసించాడు.
నికోలస్ పూరన్ మెరుపు ఇన్నింగ్స్‌పై మాట్లాడుతూ.. "అతనికి పూర్తి స్వేచ్ఛనివ్వాలని అనుకుంటున్నాం. అతను మా కోసం అద్భుతంగా ఆడుతున్నాడు. జట్టు ఇప్పుడు బాగా కుదురుకుంటోంది, ఈ గెలుపు మాలో కాన్ఫిడెన్స్ పెంచింది" అని పేర్కొన్నాడు.