
• ఎవరీ అనికేత్ వర్మ, నేపథ్యం ఏంటి?
మధ్యప్రదేశ్‌కు చెందిన ఈ కుర్రాడిని SRH జట్టు IPL 2025 వేలంలో రూ.30 లక్షలకు కొనుగోలు చేసింది. ఆశ్చర్యకరంగా, ఐపీఎల్ అరంగేట్రానికి ముందు అతను కేవలం ఒకే ఒక్క సీనియర్ డొమెస్టిక్ t20 మ్యాచ్ ఆడాడు. 2024-25 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆడిన ఆ మ్యాచ్‌లో గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు.
కానీ అసలు మ్యాటర్ ఏంటంటే, మధ్యప్రదేశ్ ప్రీమియర్ లీగ్‌లో ఇతని ప్రదర్శనే అందరినీ ఆకర్షించింది. ఆ లీగ్‌లో 5 ఇన్నింగ్స్‌లలో ఏకంగా 205కు పైగా స్ట్రైక్ రేట్‌తో 244 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అందులో మాల్వా పాంథర్స్‌పై కేవలం 41 బంతుల్లో 123 పరుగుల విధ్వంసకర శతకం కూడా ఉంది.
ఐపీఎల్‌కు ముందు SRH నిర్వహించిన ప్రాక్టీస్ మ్యాచ్‌లలోనూ అదరగొట్టాడు. అందుకే తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన గత మ్యాచ్‌తో ఐపీఎల్‌లోకి అడుగుపెట్టాడు. ఆ మ్యాచ్‌లో 6వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి 3 బంతుల్లో 7 పరుగులు చేశాడు. బ్యాటింగ్‌తో పాటు, వర్మ ఒక మంచి మీడియం పేస్ బౌలర్ కూడా. గతంలో కర్ణాటక అండర్-23 జట్టుపై పురుషుల వన్డే టోర్నమెంట్‌లో సెంచరీ చేయడం అతని ఆల్ రౌండ్ ప్రతిభకు నిదర్శనం.
అగ్రశ్రేణి క్రికెట్‌కు కొత్తే అయినా, లక్నోపై అనికేత్ ఆడిన తీరు పెద్ద వేదికలపై రాణించగల సత్తా తనకుందని నిరూపించింది. అతని నిర్భయమైన షాట్లు, అసాధారణ స్ట్రైక్ రేట్ చూస్తుంటే... IPL 2025లో కచ్చితంగా గమనించాల్సిన ప్రతిభావంతుడిగా కనిపిస్తున్నాడు. SRH ఓటమిపాలైనా, ఈ రూపంలో ఒక కొత్త ఆశాకిరణం దొరికినట్లే