టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.  తన అద్భుతమైన ఆట తీరుతో టీమిండియాకు ఎన్నో విజయాలను అందించాడు. హార్దిక్ పాండ్యా ప్రస్తుతం ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. మొదటి మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ టీమ్ తన ఆట తీరును పెద్దగా ప్రదర్శించలేక చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓటమిపాలైంది. ఇక ముంబై ఇండియన్స్ తన రెండవ మ్యాచ్ నుంచి హార్దిక్ పాండ్యా కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. మొదటి మ్యాచ్ లో సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్ గా వ్యవహరించాడు.


 ఇక హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ జట్టు ఏ విధంగా తన ఆట తీరును ప్రదర్శిస్తుందో చూడాలి. ఇదిలా ఉండగా.... హార్దిక్ పాండ్య వ్యక్తిగత విషయానికి వచ్చినట్లయితే... బాలీవుడ్ నటి నటాషా స్టాంకోవిక్ ను ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ జంటకు ఓ పండంటి మగ బిడ్డ కూడా జన్మించాడు. ఇక ఏవో కొన్ని మనస్పర్ధల కారణంగా ఈ జంట కొన్ని రోజుల క్రితమే విడాకులు తీసుకున్నారు. విడాకుల అనంతరం తమ కుమారుడు అగస్త్యకు కో పేరెంట్స్ గా ఉంటామని హార్దిక్ పాండ్యా, నటాషా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. 

ఇక విడాకుల అనంతరం నటాషా తన కుమారుడైన తీసుకొని సెర్బియా దేశానికి వెళ్లిపోయింది. ఇక తనకు కుదిలేనప్పుడల్లా ముంబై, హైదరాబాద్ నగరాలకు అగస్త్యను తీసుకొని వస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే హార్దిక్ పాండ్యా తన కుమారుడిని కలిసి తనతో సమయాన్ని గడుపుతూ ఉంటాడు. ఇదిలా ఉండగా నటాషా విడాకుల అనంతరం వేరే వ్యక్తితో రిలేషన్ కొనసాగిస్తున్నట్టుగా ఎన్నో రకాల వార్తలో వైరల్ అవుతూనే ఉన్నాయి. 

అందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు కానీ నటాషాకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ గా మారుతుంది. నటాషా తన అందాలను చూపిస్తూ రెడీ అవుతున్నట్టుగా ఓ వీడియోను ఇన్ స్టాలో షేర్ చేసుకుంది. ఈ వీడియోని చూసిన చాలా మంది నెగిటివ్ గా కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: