చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మధ్య జరిగిన ఐపీఎల్ 2025 మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. చెపాక్‌లో 17 ఏళ్లుగా గెలవని తమ రికార్డును RCB మార్చాలనుకున్నా, కోహ్లీ ఇన్నింగ్స్ మాత్రం అనుకున్నంత వేగంగా సాగలేదు. అయినా సరే, కింగ్ కోహ్లీ ఓ అద్భుతమైన మైలురాయిని అందుకున్నాడు.

గతంలో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)పై హాఫ్ సెంచరీతో అదరగొట్టిన కోహ్లీ, CSK బౌలర్ల ముందు కాస్త తడబడ్డాడు. 30 బంతుల్లో 31 పరుగులు చేసి నూర్ అహ్మద్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. అయితే, ఈ స్కోరుతోనే కోహ్లీ IPL చరిత్రలో CSKపై అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్‌తో CSKపై కోహ్లీ మొత్తం పరుగులు 1084కి చేరాయి. దీంతో, శిఖర్ ధావన్ (1057 పరుగులు) పేరిట ఉన్న రికార్డు బద్దలైంది.

CSKపై అత్యధిక IPL పరుగులు చేసిన టాప్ బ్యాటర్లు వీరే:

1084 – విరాట్ కోహ్లీ మొదటి స్థానంలో రీసెంట్ గానే నిలిచాడు.

1057 – శిఖర్ ధావన్ టాప్ హిట్టర్ ఇంతకుముందు ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు.

896 – రోహిత్ శర్మ

727 – దినేష్ కార్తీక్

696 – డేవిడ్ వార్నర్

ఈ రికార్డు బ్రేకింగ్ ఇన్నింగ్స్‌తో కోహ్లీ మరో రెండు భారీ మైలురాళ్లకు చేరువైనా, చివరిలో వాటిని తృటిలో చేజార్చుకున్నాడు.

టీ20 క్రికెట్‌లో 13,000 పరుగులు పూర్తి చేసిన తొలి భారతీయుడిగా నిలిచేందుకు అతనికి కేవలం 24 పరుగులు అవసరమయ్యాయి.

అలాగే, టీ20 మ్యాచ్‌లలో ఓపెనింగ్ బ్యాటర్‌గా 5,000 పరుగులు పూర్తి చేయడానికి మరో ఏడు పరుగులు కావాల్సి ఉండేది.

కోహ్లీ ఈ రెండు మైలురాళ్లను అందుకోలేకపోయినా, CSKపై అతను నెలకొల్పిన రికార్డు మాత్రం చరిత్రాత్మకమైనదే. చెన్నై సూపర్ కింగ్స్‌పై అతని నిలకడ, ఆధిపత్యం చూస్తే.. ఐపీఎల్ చరిత్రలో అతనెందుకు అత్యంత ప్రమాదకరమైన బ్యాటర్లలో ఒకడిగా కొనసాగుతున్నాడో స్పష్టమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: