చెన్నై సూపర్ కింగ్స్‌ అంటే సాధారణంగా అందరికీ గుర్తొచ్చేది ధోనీనే. ధోనీ గురించి ఇక్కడ ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అందుకే కేవలం ధోని కోసమే సీఎస్కే మ్యాచులు చూసేందుకు ప్రేక్షకులు స్టేడియానికి పోటెత్తుతుంటారు. ఈ నేపథ్యంలోనే అంబటి రాయుడు చేసిన వ్యాఖ్యలు ఇపుడు మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ధోనీకి ఉన్న క్రేజ్ వల్ల జట్టులోకి వచ్చే కొత్త ఆటగాళ్లు ఇబ్బంది పడతారని, వారిపై ఎక్కువ ఒత్తిడి ఉంటుందని ఈ మాజీ ప్లేయర్ కామెంట్స్ చేశాడు. అదే సమయంలో దానికి గల కారణాన్ని కూడా వివరించాడు.

అంబటి రాయుడు మాట్లాడుతూ... "ధోనీ క్రేజ్‌తోనే సీఎస్కే ఇన్నాళ్లూ నెట్టుకుంటూ వస్తోంది. అతడి కోసమే మ్యాచ్ చూసేందుకు ప్రేక్షకులు స్టేడియానికి తరలి వస్తూ ఉంటారు. అందుకే ఈ క్రేజ్. ఒక్కసారి మహీ గాని వెళ్లిపోతే సీఎస్కే పరిస్థితి మరోలా మారిపోవచ్చు. దీనిని దృష్టిలో పెట్టుకొని మహీ అంతటి క్రేజ్ ఉండేలా, అభిమానులను భారీ స్థాయిలో మైదానాలకు రప్పించే స్థాయి క్రికెటర్ ను సీఎస్కే తయారు చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అయితే ప్రస్తుతం అంతటి స్థాయి కలిగిన మరో క్రికెటర్ లేడు!" అని రాయుడు చెప్పుకొచ్చాడు.

అవును, ఏది ఏమైనప్పటికీ... ఈ విషయంపై CSK ఎలా స్పందించినప్పటికీ... ధోనీపై ఫ్యాన్స్ కు ఎటువంటి అభిమానం వుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతనిపై అభిమానులకు ఎంత అభిమానం ఉందంటే? అది CSKలోని ఇతర ఆటగాళ్లపై దృష్టి పడకుండా చేస్తోందని అని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే ధోనీ కోసమే అభిమానులు భారీగా తరలి వస్తారు. అయితే కొత్త వాళ్లు బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు వారు త్వరగా ఔట్ అవ్వాలని అభిమానులు కోరకుంటారు కూడా. అయితే దాని అర్థం జట్టు ఓడిపోవాలని కాదు. ధోనీ త్వరగా బ్యాటింగ్‌కు వస్తాడనే ప్రేమతోనే అలా చెబుతుంటారు. అందుకే, అతడిని తలా (నాయకుడు) అని కూడా అభిమానులు పిలుస్తుంటారు. జట్టులోకి ఇతర క్రికెటర్లకు కూడా ఈ విషయం క్రీజులోకి వెళ్లగానే అర్థమయిపోతుంది. దీంతో వాళ్లపై కాస్త ఒత్తిడి పెరుగుతుంది అనేది అయితే వాస్తవం.

మరింత సమాచారం తెలుసుకోండి:

csk