అవును, మీరు షాక్ అవుతున్నా ఇదే నిజం. ఐపీఎల్ లో ఆ మ్యాచ్ రీ షెడ్యూల్ అయింది. కోల్‌కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వాయిదా పడినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆదివారం రోజు జరగాల్సిన మ్యాచ్ ‌ను మంగళవారానికి వాయిదా వేస్తూ బీసీసీఐ రీషెడ్యూల్ చేయడంతో ఈ విషయం ఇపుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. షెడ్యూల్ ప్రకారం అయితే ఏప్రిల్ 6న ఆదివారం నాడు కోల్‌కతా లోని ఈడెన్ గార్డెన్స్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ తో లక్నో సూపర్ జెయింట్స్ తలపడాల్సి ఉండగా... కోల్‌కతా పోలీసుల అభ్యర్థన మేరకు ఈ మ్యాచ్‌ను ఏప్రిల్ 6న కాకుండా ఏప్రిల్ 8న నిర్వహించాలని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (BCCI) నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

విషయంలోకి వెళితే... కొన్ని ఉత్సవాలు, కార్యక్రమాలు కారణంగానే ఆదివారం నాడు ఈడెన్ గార్డెన్స్ లో జరగాల్సిన మ్యాచ్‌కు పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేయడం కుదరదని, మ్యాచ్ రీషెడ్యూల్ చేయాలని కోల్‌కతా పోలీసులు రిక్వెస్ట్ చేయగా రీషెడ్యూల్ చేసినట్టు భోగట్టా. దాంతో కేకేఆర్, లక్నో మ్యాచ్‌ను బీసీసీఐ అధికారికంగా రీ షెడ్యూల్ చేసింది. దాంతో రెగ్యూలర్ టైమ్ రాత్రి 07:30 కి కాకుండా, ఏప్రిల్ 8వ తేదీన మధ్యాహ్నం 03:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. దాంతో వచ్చే వారం నాడు సింగిల్ మ్యాచ్ ఉండనుంది. ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ 8న (మంగళవారం) డబుల్-హెడర్ మ్యాచ్‌లు ఉన్నాయని బీసీసీఐ తన ప్రకటనలో కూడా తాజాగా స్పష్టం చేస్తూ ఓ క్లారిటీ ఇవ్వడం జరిగింది.

ఇకపోతే ఆరోజు 2 మ్యాచ్లు జరగాల్సి ఉండగా కోల్‌కతా- లఖ్నవూ మ్యాచ్‌ తేదీ మారింది. హైదరాబాద్‌ వేదికగా ఆదివారం షెడ్యూల్ చేసిన రెండో మ్యాచ్‌ యథాతథంగా జరగనుంది. సన్ రైజర్స్ హైదరాబాద్‌, గుజరాత్‌ జెయింగ్స్  రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానున్న మ్యాచ్ లో తలపడనున్నాయి. దీంతో ఏప్రిల్ 6న హైదరాబాద్‌ వేదికగా సన్రైజర్స్- గుజరాత్ మధ్య పోరు ఒక్కటే ఉండనుంది. ఇంతకూ ముందు కూడా అంటే? గతేడాది కేకేఆర్‌ - రాజస్థాన్ జట్ల మధ్య మ్యాచ్‌కు కూడా ఇదే పరిస్థితి ఎదురైన సంగతి మీకు గుర్తుండే ఉంటుంది. అప్పుడు కూడా శ్రీరామనవమి రావడం వల్ల ఆ మ్యాచ్‌ను ఐపీఎల్ కమిటీ రీషెడ్యూల్‌ చేసింది. అలాగే ఈ ఏడాది కూడా మ్యాచ్ రీ షెడ్యూల్ అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

IPL