అవును, చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే) కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, తమ ఓటమికి కారణం కుండ బద్దలు కొట్టేలాగా చెప్పేసాడు. కేవలం చెత్త ఫీల్డింగ్ వలన తమని ఓటమి చవిచూసింది అని రుతురాజ్ గైక్వాడ్ అన్నాడు. ఆటలో ఎంతో కీలకమైన క్యాచ్‌లు పట్టి ఉంటే మాత్రం ఫలితం ఇంకోలా ఉండేదన్నాడు. విషయంలోకి వెళితే... ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా శుక్రవారం చెపాక్ వేదికగా ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) 50 పరుగుల తేడాతో సీఎస్‌కేను ఓడించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన రుతురాజ్ గైక్వాడ్.. ఈ విధంగా కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది.

క్యాచ్‌లు చేజేతులారా నేల పాలు చేయడం, బౌలింగ్‌లో అదనంగా 20 పరుగులివ్వడం, బ్యాటింగ్‌లోనూ పవర్ ప్లేలో వేగంగా పరుగులు చేయలేక పోవడం వల్లనే మూల్యం చెల్లించుకోవలసి వచ్చిందని అభిప్రాయపడ్డాడు. ఈ సందర్భంగా రుతురాజ్ మాట్లాడుతూ... 'నిజాయితీగా మాట్లాడుకోవాలంటే? ఈ వికెట్‌పై 170 పరుగులు చేధించడమే చాలా కష్టం. ఎందుకంటే? ఈ పిచ్ బ్యాటింగ్‌కు ఎంత మాత్రమూ అనుకూలంగా లేదు. ఫీల్డింగ్‌లో ఈ రోజు మాకు బ్యాడ్ డే. చెత్త ఫీల్డింగే మా పతనాన్ని శాసించింది.... అంటూ వాపోయాడు.

ఇంకా రుతురాజ్ మాట్లాడుతూ... "170 పరుగుల లక్ష్యాన్ని చేధించాలంటే మేము ఖచ్చితంగా విభిన్నంగా బ్యాటింగ్ చేయవలసి ఉంది. కాస్త టైమ్ కూడా తీసుకొని ఆడవచ్చు. కానీ దృదృష్టవశాత్తూ అలా జరగలేదు. 170 రన్స్‌కు అదనంగా 20 పరుగుల లక్ష్యాన్ని బ్యాటింగ్‌కు కఠినంగా ఉన్న వికెట్‌పై చేధించాలంటే పవర్‌ప్లేలో దూకుడుగా ఆడితీరాల్సిందే. కానీ అలా ఇక్కడ జరగలేదు. మరో విషయం ఏమిటంటే? కొత్త బంతే 5 ఓవర్ల వరకు ఆగుతూ వచ్చింది. ఇది ఎలా జరిగిందో అస్సలు అర్ధం కాలేదు. చేయాల్సిన పరుగుల కంటే ఎక్కువ చేసినప్పుడు.. అదనంగా 20 పరుగులు చేధించాల్సినప్పుడు.. దూకుడుగానే ఆడాలి. మేం ఆ ప్రణాళికతోనే ఆడబోయాం. కానీ వర్కౌట్ కాలేదు. అయితే మ్యాచ్‌ ఓడినా సంతోషంగానే ఉంది. ఎందుకంటే? భారీ తేడాను 50 పరుగులకు తగ్గించాం.!" అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

CSK