
మీడియాతో మాట్లాడుతూ, నిక్ ఖాన్ అసలు విషయం చెప్పారు. WWEకి మాత్రమే కాదు, రీసెంట్‌గా డీల్ కుదుర్చుకున్న నెట్‌ఫ్లిక్స్‌కు కూడా ఇండియానే టాప్ ప్రయారిటీ అంట. నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు తమకు అత్యంత ముఖ్యమైన దేశాల లిస్ట్ ఒకటి WWEకి ఇచ్చారట, అందులో అడక్కుండానే ఇండియా పేరు టాప్‌లో ఉందని ఖాన్ తెలిపారు. "నెట్‌ఫ్లిక్స్‌కి ఇండియా ముఖ్యం అయితే, మాకు కూడా అంతే ముఖ్యం" అని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం 2026, 2027 సంవత్సరాల షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నామని, ఆ చర్చల్లో ఇండియా పేరు ఖచ్చితంగా ఉందని కన్ఫర్మ్ చేశారు.
మరోవైపు, WWE ఇప్పుడు ఓ సంచలన స్టోరీలైన్‌తో దుమ్ము రేపుతోంది. జాన్ సీనా ఎవరూ ఊహించని విధంగా 'హీల్' (విలన్)గా మారిపోయి ప్రపంచాన్ని షాక్‌కు గురిచేశాడు. ఎలిమినేషన్ ఛాంబర్ 2025లో ఈ ఘటన జరిగింది. 16 సార్లు వరల్డ్ ఛాంపియన్ అయిన సీనా, 'ఫైనల్ బాస్' ది రాక్‌తో చేతులు కలిపి, ప్రస్తుత WWE యూనివర్సల్ ఛాంపియన్ కోడీ రోడ్స్‌పై దారుణంగా దాడి చేశాడు. ఈ షాకింగ్ నమ్మకద్రోహం ఇప్పుడు రెజిల్ మేనియా 41లో సీనా వర్సెస్ కోడీ మధ్య ఓ ఎపిక్ ఫైట్‌కు రంగం సిద్ధం చేసింది.
ఏప్రిల్ 1 నుంచి ఇండియాలో RAW, స్మాక్‌డౌన్, రెజిల్ మేనియా సహా అన్ని WWE షోలు, స్పెషల్ ఈవెంట్‌లు కేవలం నెట్‌ఫ్లిక్స్‌లోనే లైవ్ స్ట్రీమ్ అవుతాయి. ఒకవేళ లైవ్ చూడటం మిస్ అయినా, వెంటనే రీప్లే చూసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది. ఇకపై రెగ్యులర్ టీవీ ఛానెళ్లలో WWE ప్రోగ్రామింగ్ అందుబాటులో ఉండదు.
ఇండియాలో నెట్‌ఫ్లిక్స్ వాడకం భారీగా పెరుగుతున్న నేపథ్యంలో, WWE తన ఫ్యాన్ బేస్‌ను మరింత విస్తరించుకోవాలని, రాబోయే సంవత్సరాల్లో చెప్పినట్లుగా ఓ భారీ లైవ్ ఈవెంట్‌ను ఇండియాకు తీసుకురావడం ఖాయమనే నమ్మకంతో ఉంది.