
ఈ వార్తలపై క్రికెట్ వెబ్‌సైట్ క్రిక్‌బజ్.. ECBని వివరణ కోరగా, వాళ్లు కన్ఫర్మ్ చేయలేదు, ఖండించనూ లేదు. "ఇప్పుడైతే దీనిపై మేం ఏం చెప్పలేం" అని మాత్రమే ఒక ప్రతినిధి అన్నారు. కానీ, పటౌడీ ఫ్యామిలీకి మాత్రం ఈ విషయం గురించి సమాచారం అందిందట. దివంగత మన్సూర్ అలీ ఖాన్ పటౌడి పేరు మీదుగా ఈ ట్రోఫీని ఏర్పాటు చేశారు. ఆయన భార్య, నటి షర్మిల ఠాగూర్ గతంలోనే ECB తమ ఫ్యామిలీని సరిగా చూడలేదని తన అసంతృప్తిని బయటపెట్టారు.
2018లో స్పోర్ట్‌స్టార్‌తో మాట్లాడుతూ.. ఒకసారి ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఆండ్రూ స్ట్రాస్ ట్రోఫీ తీసుకుంటున్నప్పుడు టైగర్ పటౌడి దగ్గర చాలా చులకనగా తీసుకున్నాడని, ఆ సమయంలో ఫోటోలు, వీడియోలు కూడా తీయలేదని ఆమె ఫీలయ్యారు. అది తమకు అవమానకరంగా అనిపించిందని చెప్పారు.
క్రికెట్‌లో ట్రోఫీలను రద్దు చేయడం చాలా అరుదు. కానీ అప్పుడప్పుడు ఇలా జరుగుతుంటాయి. రీసెంట్‌గా విస్డెన్ ట్రోఫీ పేరును మార్చి రిచర్డ్స్-బోథమ్ ట్రోఫీగా పేరు పెట్టారు. పటౌడీ ట్రోఫీ ఒక్కటే కాదు.. భారత్‌లో ఈ ట్రోఫీని ఆంటోనీ డి మెల్లో ట్రోఫీ అని కూడా అంటారు. దీన్ని 1951 నుంచి ఇస్తున్నారు.
పటౌడీ ట్రోఫీకి చాలా చరిత్ర ఉంది. ఇండియా-ఇంగ్లండ్ క్రికెట్ రైవల్రీస్‌లో దీనికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. అలాంటి ట్రోఫీని రద్దు చేయడం నిజంగా పెద్ద మార్పు అవుతుంది. మరి ECB ఈ విషయంలో ముందుకెళ్తుందో లేదో చూడాలి.