ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ దుమ్ము రేపింది. వాంఖడే స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌ (కేకేఆర్)ను చిత్తు చేసి, చరిత్ర సృష్టించింది. ఒకే వేదికపై ఒకే జట్టుపై పది విజయాలు సాధించిన మొట్టమొదటి టీమ్‌గా రికార్డుల్లోకి ఎక్కింది ముంబై. ఇంతకుముందు ఈ రికార్డు కేకేఆర్ పేరు మీద ఉండేది. వాళ్లు ఈడెన్ గార్డెన్స్‌లో పంజాబ్ కింగ్స్‌పై తొమ్మిది సార్లు గెలిచి అదరగొట్టారు. కానీ ఇప్పుడు ముంబై.. కేకేఆర్ రికార్డును బద్దలు కొట్టి, వాళ్ల కొంప‌లోనే నిప్పు పెట్టింది.

 ఒకే గ్రౌండ్ లో ఒకే టీం పై ఎక్కువసార్లు ఓడిపోయిన ఐపీఎల్ ఒక అప్రతిష్టను మూటగట్టుకుంది కేకేఆర్. కేకేఆర్‌పై ముంబైకి ఇది 24వ విజయం. ఐపీఎల్ హిస్టరీలో ఒక టీమ్ మీద ఇన్ని మ్యాచ్‌లు గెలిచిన జట్టు మరొకటి లేదు. చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే), కేకేఆర్ కూడా 21 విజయాలతో వెనకే ఉన్నాయి. అయితే, ఏప్రిల్ 26న పంజాబ్‌తో జరిగే మ్యాచ్‌లో కేకేఆర్ గెలిస్తే, ముంబై రికార్డును సమం చేసే ఛాన్స్ ఉంది. కానీ ముంబై మాత్రం ఊరుకుంటుందా అసలు ఛాన్సే లేదు.

ముంబై విజయంలో ఇద్దరు హీరోలు దుమ్ము దులిపారు. ఒకడు అరంగేట్ర ఆటగాడు అశ్విని కుమార్ అయితే, మరొకడు విధ్వంసకర బ్యాటర్ ర్యాన్ రికెల్టన్. పంజాబ్‌లోని ఝంజేరికి చెందిన 23 ఏళ్ల అశ్విని.. ఐపీఎల్‌లో ఎంట్రీ అదిరిపోయేలా ఇచ్చాడు. తొలి మ్యాచ్‌లోనే ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టిన తొలి భారతీయ ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు. అశ్విని తన స్పెల్ లో కేవలం 24 పరుగులే ఇచ్చి, కేకేఆర్ బ్యాటింగ్ లైనప్‌ను కుప్పకూల్చాడు. ఇక ర్యాన్ రికెల్టన్ అయితే 62 పరుగులతో నాటౌట్‌గా నిలిచి, ముంబైకి తిరుగులేని విజయాన్ని అందించాడు. ఫలితంగా ముంబై ఎనిమిది వికెట్ల తేడాతో కేకేఆర్‌ను ఊచకోత కోసింది.

ముంబై ఇండియన్స్ ఐపీఎల్‌లో ఎప్పుడూ టాప్ టీమే. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ)పై కూడా ముంబైకి తిరుగులేని రికార్డు ఉంది. వాంఖడే, చిన్నస్వామి స్టేడియాల్లో ఆర్సీబీని చెరో ఎనిమిదిసార్లు ఓడించింది ముంబై. చెన్నై కూడా సొంతగడ్డపై ఆర్సీబీని ఎనిమిదిసార్లు ఓడించింది కానీ.. మొన్నటి మ్యాచ్‌లో కేకేఆర్ చేతిలో 50 పరుగుల తేడాతో ఓడిపోయి రికార్డు సమం చేసే ఛాన్స్ మిస్ చేసుకుంది.

ఇంకా సీజన్ చాలా ఉంది కాబట్టి, మే 17న బెంగళూరుతో జరిగే మ్యాచ్‌లో కేకేఆర్ గెలిస్తే ముంబై రికార్డును మళ్లీ టచ్ చేసే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతానికి మాత్రం ఐపీఎల్ హిస్టరీలో ముంబై ఇండియన్సే నంబర్ వన్ టీమ్ అనడంలో సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: