ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ చాలా రసవత్తరంగా కొనసాగుతోంది. ఇప్పటికే దాదాపు 15 మ్యాచ్ల వరకు పూర్తయ్యాయి. అయితే ఇలాంటి నేపథ్యంలో సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మధ్య తీవ్ర వివాదం నెలకొంది. ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. మీది తప్పంటే మీది అని... ఒకరిపై మరొకరు నిందలు కూడా వేసుకుంటున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మధ్య వివాదం లో కీలక పరిణామం తోటి చేస్తుంది.


 తాజాగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వర్సెస్ సన్రైజర్స్ హైదరాబాద్ టికెట్స్  వివాదం చల్లారినట్లు తెలుస్తోంది. ఇద్దరి మధ్య ఒక కీలక ఒప్పందం వచ్చిందని వార్తలు వస్తున్నాయి. ఈ వివాదం సర్దుమనిగిందని కూడా తాజాగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులతో పాటు సన్రైజర్స్ హైదరాబాద్ ప్రతినిధులు కూడా అధికారికంగా ప్రకటన చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కారణంగా ఈ వివాదం సద్దు మనిగిందని ప్రచారం జరుగుతుంది.

 ఒప్పందం ప్రకారం 10%... ఉప్పల్ స్టేడియం లో జరిగే టికెట్లు ఇస్తామని సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు యాజమాన్యం ప్రకటన చేసింది. గతంలో లాగా అన్ని కేటగిరిలలో  పాసులు కూడా కేటాయించాలని... హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కోరడం జరిగింది. అయితే దీనిపై సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు సీఈఓ షణ్ముగం.. కూడా స్పందించడం జరిగింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అడిగినట్లుగానే ఆయన... గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారట.

 అయితే ఈ వివాదం తీవ్రంగా మారిన నేపథ్యంలో రెండు రోజుల కిందట తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా సీరియస్ అయ్యారట. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు యాజమాన్యానికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని ఆదేశాలు ఇచ్చారట తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ తరుణంలోనే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వర్సెస్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్ల ప్రతినిధుల మధ్య... ఒప్పందం జరిగింది. దీంతో ఈ వివాదం పూర్తిగా సద్దుమణిగిందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: