
నిజానికి, గత నవంబర్లో చూస్తే సీన్ వేరు. అప్పుడు CSK, MI కంటే వెనకే ఉండేది. కానీ RCB టీమ్ మాత్రం వేరే లెవెల్లో ప్లాన్ చేసింది. అదిరిపోయే కంటెంట్, ఫ్యాన్స్ పిచ్చ సపోర్ట్తో ఒక్కసారిగా దూసుకెళ్లింది. మార్చి 23న 17 మిలియన్ మార్క్ టచ్ చేసింది. ఆ తర్వాత కేవలం 10 రోజుల్లోనే 18 మిలియన్ కొట్టేసింది. ఇప్పుడు చూస్తే CSK 17.7 మిలియన్, MI 16.2 మిలియన్లతో వెనకబడిపోయాయి.
దీనికి అసలు కారణం ఏంటంటే రీసెంట్‌గా CSK సొంత గ్రౌండ్లో వాళ్ళని ఓడగొట్టింది RCB. అది కూడా 17 ఏళ్ల తర్వాత ఫస్ట్ టైమ్ విక్టరీ కొట్టింది. ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేశారు. ఫాలోయర్లు ఒక్కసారిగా పెరిగిపోయారు.
RCB ఇన్‌స్టా సక్సెస్ సీక్రెట్ ఏంటంటే.. ఫ్యాన్స్తో కనెక్ట్ అయ్యేలా చాలా జెన్యూన్ గా, ఎంగేజింగ్గా కంటెంట్ పెడుతున్నారు. వాళ్ల పోస్టులు చూస్తే ఫుల్ ఫన్, ఇంటరాక్టివ్ గా ఉంటాయి. ప్లేయర్స్ పర్సనాలిటీస్ని బాగా చూపిస్తారు. అందుకే ఫ్యాన్స్ కు టీమ్ కు మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది.
RCB చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ రాజేష్ మీనన్ ఏం చెప్పారంటే, "మేము మా ఫ్యాన్స్ డైలీ లైఫ్ లో పార్ట్ అవ్వాలనుకుంటున్నాం. ఎప్పుడూ ట్రెండింగ్లో ఉండాలి, ఎంగేజింగ్గా, ఇంట్రెస్టింగ్గా ఉండాలి అనేది మా టార్గెట్. జెన్యూనిటీ, టీమ్ ఫిలాసఫీని సెలెబ్రేట్ చేయడం, మా ఫ్యాన్స్ సపోర్ట్ ని హైలైట్ చేయడంపైనే మా స్ట్రాటజీ ఫోకస్ చేస్తుంది. సోషల్ మీడియా మాకు జస్ట్ ప్లాట్ఫామ్ కాదు.. ఫ్యాన్స్ తో స్ట్రాంగ్ రిలేషన్‌షిప్ క్రియేట్ చేసుకునే వేదిక" అని అన్నారు. అలాపాపులారిటీ పెరుగుతుండటంతో RCB ఇప్పుడు గ్రౌండ్లోనే కాదు, డిజిటల్ వరల్డ్ లో కూడా రూల్ చేస్తోంది.