
ఇందులో భాగంగానే ఇవాళ మరో కీలక ఫైట్ కు రంగం సిద్ధం చేసుకుంది సన్రైజర్స్ హైదరాబాద్. ఇలాంటి నేపథ్యంలో... సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టులో డేంజర్ ఆటగాడు దూరం కాబోతున్నాడట. ఇవాల్టి మ్యాచ్లో ఆ ప్లేయర్ ఆడబోడని తెలుస్తోంది. అనికేత్ శర్మ ... కేకేఆర్ జట్టుతో జరిగే ఇవాల్టి మ్యాచ్ ఆడబోడని తెలుస్తోంది. గత మ్యాచ్లో ఫీల్డింగ్ చేస్తుండగా అనికేత్ శర్మకు తీవ్ర గాయం అయిందని వార్తలు వస్తున్నాయి.
దీంతో ఒక మ్యాచ్ రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచనలు చేశారట. ఒకవేళ ఇదే నిజమైతే... సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ అని చెప్పవచ్చు. ఎందుకంటే మొన్నటి మ్యాచ్లో... అనికేత్ శర్మ ఒక్కడే జట్టును లీడ్ చేశాడు. సిక్స్ లు అలాగే బౌండరీలతో రెచ్చిపోయి జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు అనికేత్ శర్మ. మరో ఓవర్ ఆడి ఉంటే అనికిత్ శర్మ సెంచరీ కూడా చేసుకునేవాడు. అయితే అలాంటి ప్లేయర్ హైదరాబాద్ కు దూరం కావడం నిజంగా బాధాకరమే.
ఇది ఇలా ఉండగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో భాగంగా ఇవ్వాలా సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ కేకేఆర్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరుగుతోంది. ఈడెన్ గార్డెన్స్ లో మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో కేకేఆర్ జట్టుకు కాస్త అడ్వాంటేజ్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. మరి ఈ మ్యాచ్ లో సన్రైజర్స్ ప్లేయర్లు ఎలా ఆడతారో చూడాలి.