
ముంబై టీమ్‌ను వదలడం అంత ఈజీ కాదని జైస్వాల్ స్వయంగా చెప్పాడు. "ఈ నిర్ణయం తీసుకోవడం చాలా కష్టం. ముంబై అంటే నాకు చాలా గౌరవం. నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది ముంబైనే. వాళ్లకి ఎప్పటికీ రుణపడి ఉంటాను" అని ఎమోషనల్‌గా అన్నాడు. మరి గోవా టీమ్‌లోకి ఎందుకు మారుతున్నావ్ అంటే.. లీడర్‌షిప్ రోల్ కోసమేనని చెప్పాడు జైస్వాల్. "నాకు దేశం తరఫున ఆడటమే ఫస్ట్ ప్రయారిటీ.
కానీ ఎప్పుడైతే నేషనల్ డ్యూటీ ఉండదో, అప్పుడు గోవా టీమ్ కోసం డొమెస్టిక్ టోర్నీల్లో ఆడతాను. గోవా టీమ్‌ను గెలిపించడంలో నా వంతు కృషి చేస్తాను. ఇది నాకు మంచి ఛాన్స్ అనిపించింది, అందుకే ఓకే చెప్పేశాను" అని జైస్వాల్ క్లారిటీ ఇచ్చాడు. జైస్వాల్ లాస్ట్ టైమ్ ముంబై టీమ్ కోసం రంజీ ట్రోఫీలో ఆడాడు (జమ్మూ కాశ్మీర్‌తో మ్యాచ్, జనవరి 23-25). bcci రూల్స్ ప్రకారం, ఇండియా టీమ్‌లో లేనప్పుడు డొమెస్టిక్ క్రికెట్ ఆడటం కంపల్సరీ.
జైస్వాల్ నిర్ణయంపై ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) సీనియర్ అధికారి ఒకరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. "మేము అస్సలు ఊహించలేదు. కానీ వాడికి కొన్ని కారణాలు ఉండి ఉంటాయి. వాడు వెళ్లాలని అడిగాడు, మేము ఒప్పుకున్నాం అంతే" అని చెప్పారు.
గోవా క్రికెట్ అసోసియేషన్ (GCA) సెక్రటరీ షంబా దేశాయ్ జైస్వాల్ నిర్ణయాన్ని స్వాగతించారు. "జైస్వాల్ మా టీమ్ తరఫున ఆడాలని అనుకుంటున్నాడు, మాకు చాలా హ్యాపీగా ఉంది. నెక్స్ట్ సీజన్ నుంచి జాయిన్ అవుతాడు" అని దేశాయ్ తెలిపారు. జైస్వాల్ కెప్టెన్ అయ్యే ఛాన్స్ ఉందా అని అడిగితే.. "అవును, ఛాన్స్ ఉంది. అతను ఇండియా టీమ్ ప్లేయర్ కాబట్టి, కెప్టెన్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. త్వరలోనే అతనితో మాట్లాడి ఒక క్లారిటీకి వస్తాం" అని షంబా దేశాయ్ వెల్లడించారు.
ఇదిలా ఉండగా, గతంలో కూడా ముంబైకి చెందిన క్రికెటర్లు గోవా టీమ్‌కి మారారు. అర్జున్ టెండూల్కర్, సిద్ధేశ్ లాడ్ కూడా ఇంతకుముందు గోవా టీమ్‌కి షిఫ్ట్ అయ్యారు. అయితే సిద్ధేశ్ లాడ్ మళ్లీ ముంబై టీమ్‌కి రిటర్న్ వచ్చాడు. కానీ జైస్వాల్ లాంటి స్టార్ ప్లేయర్ గోవా టీమ్‌లోకి రావడం మాత్రం డొమెస్టిక్ క్రికెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది.