ముంబై క్రికెట్‌లో ఏదో "కుట్ర" జరుగుతోందని, సూర్యకుమార్ యాదవ్ దానికి లీడ్ చేస్తున్నాడని వస్తున్న పుకార్లను స్టార్ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ (SKY) కొట్టిపారేశాడు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ ముంబైని వదిలి గోవాకు డొమెస్టిక్ క్రికెట్ ఆడటానికి వెళ్లడంతో ఈ రూమర్లు మొదలయ్యాయి.

ఏప్రిల్ 2న యశస్వి జైస్వాల్ ముంబైని వదిలి గోవా డొమెస్టిక్ టీమ్‌లో జాయిన్ అవుతున్నాడని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత జైస్వాల్ కూడా ఈ వార్తల్ని కన్ఫర్మ్ చేస్తూ, గోవా టీం తనకు లీడర్‌షిప్ రోల్ ఆఫర్ చేసిందని చెప్పాడు.

"ముంబైని వదిలి వెళ్లడం నాకు చాలా కష్టమైన నిర్ణయం," అని జైస్వాల్ మీడియాతో చెప్పాడు. "నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే అది ముంబై వల్లే. ఈ నగరం నన్ను ఈరోజు ఇలా చేసింది, ముంబై క్రికెట్ అసోసియేషన్‌కు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. కానీ గోవా నాకు కొత్త ఛాన్స్ ఇచ్చింది, లీడర్‌షిప్ రోల్ గురించి నేను చాలా ఎగ్జైటింగ్‌గా ఉన్నాను." అని జైస్వాల్ తెలిపాడు.

జైస్వాల్ గోవాకి వెళ్లిన తర్వాత, టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక రిపోర్ట్ పబ్లిష్ చేసింది. అందులో సూర్యకుమార్ యాదవ్ కూడా ముంబైని వదిలి గోవాకి వెళ్లే ఛాన్స్ ఉందని రాసుకొచ్చింది. ముంబై క్రికెట్‌లో ఏదో గొడవలు జరుగుతున్నాయని, అందుకే "కుట్ర" జరుగుతోందని ఆ ఆర్టికల్‌లో పేర్కొంది. అంతేకాదు, గోవా క్రికెట్ అసోసియేషన్ చాలా మంది ప్లేయర్లతో టచ్‌లో ఉందని, అందులో సూర్యకుమార్ ముంబై ఇండియన్స్ టీమ్‌మేట్ తిలక్ వర్మ కూడా ఉన్నాడని రాసుకొచ్చింది.

సూర్యకుమార్ ఈ రూమర్లపై సోషల్ మీడియాలో ఘాటుగా రియాక్ట్ అయ్యాడు. ఆ ఆర్టికల్ స్క్రీన్ షాట్‌ను షేర్ చేస్తూ దాన్ని ట్రోల్ చేశాడు. "వీడు స్క్రిప్ట్ రైటరా లేక జర్నలిస్టా? నాకు నవ్వొస్తే కామెడీ సినిమాలు చూడటం ఆపేసి ఇలాంటి ఆర్టికల్స్ చదవడం స్టార్ట్ చేస్తా. అబ్సల్యూట్ నాన్‌సెన్స్ ఇది," అంటూ ఫైర్ అయ్యాడు.

సూర్యకుమార్ పోస్ట్ చేసిన తర్వాత, టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్లు ఆర్టికల్‌ను అప్‌డేట్ చేశారు. "బ్యాటర్‌కి దగ్గరి సోర్సెస్ మాత్రం ఈ వార్తల్ని ఇప్పుడప్పుడే కన్ఫర్మ్ చేయట్లేదు" అని ఒక లైన్ యాడ్ చేశారు.

సూర్యకుమార్ ఇచ్చిన రియాక్షన్‌తో తను ముంబై క్రికెట్‌ను ఇప్పట్లో వదిలి వెళ్లట్లేదని క్లియర్‌గా అర్థమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: