ధావన్ ఇద్దరు పిల్లల తల్లి అయినటువంటి ఆయేషా ముఖర్జీని వివాహం చేసుకోగా వారి బంధం ఎక్కువ కాలం సాగలేదు. పెళ్ళైన అనతికాలంలోనే విడాకులు తీసుకున్నారు. కాగా వీరిద్దరి కాపురానికి గుర్తుగా ఒక కుమారుడు కూడా జన్మించాడు. ధావన్ తన కుమారుడితో ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో అప్పుడప్పుడు షేర్ చేస్తుంటాడు కూడా. కాగా విడాకులు తీసుకున్న సరిగ్గా రెండేళ్ల తర్వాత తనపై వస్తున్న రూమర్స్ పై ధావన్ మౌనాన్ని వీడారు.
టైమ్స్ నౌ సమ్మిట్ 2025 కు సంబంధించి ఓ వీడియోలో ధావన్ ను ఉద్దేశించి, తన స్నేహితురాలు గురించి ఓ యాంకర్ ప్రశ్న అడగగా... దానికి ధావన్ స్పందిస్తూ... "నేను పేరు అయితే చెప్పలేను.. కానీ, నా ప్రపంచంలో అత్యంత అందమైన, సుందరమైన అమ్మాయి మాత్రం ఆమే! తనలాంటి సౌందర్యాన్ని నేను మునుపెన్నడూ చూడలేదు. ఆమె ఓ అందాల దేవత!" అని తెలిపాడు. దాంతో సోషల్ మీడియాలో ఒక్కసారిగా ఆయనికి సంబంధించి పాత వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా ఓ యువతితో కలిసి మ్యాచ్ ను చూస్తున్న వీడియోలు బయటకు రావడం జరిగింది. కాగా ఆమె ఐర్లాండ్ కు చెందిన "సూఫీ షైన్" అంటూ పలు కథనాలు వెలువడుతున్నాయి. ధావన్ తన ఊహల సుందరి పేరు చెప్పినప్పటికీ ఆమే తన గర్ల్ ఫ్రెండ్ అంటూ ప్రసారం జరుగుతోంది. మరోవైపు ధావన్ కూడా ఆమెనే తన గర్ల్ ఫ్రెండ్ అంటూ చెప్పకనే చెప్పాడంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.