
ఈ మ్యాచ్ లో శ్రీలంక స్పిన్ బౌలర్ కమిందు మెండిస్ ను ఐపీఎల్ 2025 మెగావేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ.75 లక్షలకు కొనుగోలు చేసిన సంగతి విదితమే. కాగా తొలి మ్యాచ్‌లోనే కమిందు మెండిస్ ఇప్పటివరకు ఐపీఎల్ లో చూడని అద్భుతాన్ని ఆవిష్కరించాడు. కమిందు మెండిస్ రెండు చేతులతో బౌలింగ్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే? సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు పిలుపుతో శ్రీలంక ఆల్ రౌండర్ తన హనీమూన్ ను వాయిదా వేసుకుని మరీ ఐపీఎల్ 2025లో ఆడుతుండడం చాలా అరుదైన విషయం అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అవును.. ఐపీఎల్ కోసం తన హనీమూన్ ను కూడా త్యాగం చేశాడని తెలుస్తోంది.
ఇకపోతే, కేకేఆర్ తో జరిగిన తొలి మ్యాచ్ లోనే ఒక ఓవర్ బౌలింగ్ వేసి 4 పరుగులు ఇచ్చి ఒక కీలక వికెట్ ను పెవిలియన్ కి పంపాడు మెండిస్. హాఫ్ సెంచరీ చేసి జోరు మీదున్న అంగ్క్రిష్ రఘువంశీని కూడా ఔట్ చేశాడు. అంతేకాకుండా బ్యాటింగ్ లో కూడా పర్వాలేదు అనిపించదు. 20 బంతులు ఎదుర్కొని 27 పరుగులు చేశాడు. ఇందులో రెండు సిక్సులు, ఒక ఫోర్ ఉండడం గమనార్హం. కాగా శ్రీలంక ఆల్ రౌండర్ కమిందు మెండిస్ తన చిరకాల స్నేహితురాలైన నిష్నిని మార్చి 2025లో పెళ్లి చేసుకున్నాడు. గత ఏడాది ఏప్రిల్ లో ఎంగేజ్ మెంట్ జరిగినప్పటి నుంచి ఈ జంట వివాహం హాట్ టాపిక్ అయింది. ఈ జంట మొదట్లో విదేశాలలో హనీమూన్ ప్లాన్ చేసుకున్నప్పటికీ ఐపీఎల్ నుంచి పిలుపు రావడంతో ఆ ప్లాన్స్ ను రద్దు చేసుకున్నారట.