
కట్ చేస్తే... SRH హ్యాట్రిక్ పరాజయాలను చవిచూసింది. అవును.. ఐపీఎల్ 2025లో సన్ రైజర్స్ హైదరాబాద్ దారుణమైన ఆటతీరుని కనబరుస్తోంది. ఆడిన 4 మ్యాచ్ లలో మూడింటిలో ఓడిపోయింది. దీంతో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానానికి వెళ్ళిపోయింది. ప్రస్తుతానికి టేబుల్ టాపర్ గా పంజాబ్ కింగ్స్ కొనసాగుతోంది. 5 జట్లు 4 పాయింట్లతో, మరో 5 జట్లు 2 పాయింట్లతో ముందంజలో నిలిచాయి. పాయింట్స్ టేబుల్స్ లో పంజాబ్ తరువాత DC, RCB, GT, KKR, MI, LSG, CSK, RR, SRH వరుసగా ఉన్నాయి.
దాంతో KKR (కోల్‌కతా నైట్ రైడర్స్) తరఫున అద్భుతమైన ప్రదర్శన ఇస్తున్న వైభవ్ అరోరా ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్శించాడు. 1997 డిసెంబర్ 14న హర్యానాలోని అంబాలాలో జన్మించిన వైభవ్ హిమాచల్ ప్రదేశ్ తరఫున దేశీయ క్రికెట్ ఆడుతున్న సంగతి విదితమే. 2022లో పంజాబ్ కింగ్స్ (PBKS) జట్టుతో ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన అరోరా 5 మ్యాచ్‌ల్లో ఆడడం జరిగింది. 2024 సీజన్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన అరోరా 10 మ్యాచ్‌ల్లో 11 వికెట్లు తీయడం గమనార్హం. వైభవ్ 2019లో సౌరాష్ట్రతో జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్ ద్వారా తన ఫస్ట్-క్లాస్ క్రికెట్‌ను కెరీర్ ని స్టార్ట్ చేసాడు. ఈ క్రమాలమో దేశీయ క్రికెట్‌లో అద్భుతంగా రాణించిన అరోరా ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించారు. 2022-23 రంజీ ట్రోఫీ సీజన్‌లో హిమాచల్‌ప్రదేశ్ తరఫున అత్యధికంగా 25 వికెట్లు తీసి, ఒడిశాపై ఐదు వికెట్ల హాల్‌ను నమోదు చేశారు. దాంతో కేకేఆర్, ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు అతడిని ట్రయల్స్‌కు ఆహ్వానించగా, 2021 ఐపీఎల్ మినీ వేలంలో కేకేఆర్ రూ. 20 లక్షలకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ 2025 వేలంలో ఇది ఒక రికార్డు ధర అని చెప్పుకోవచ్చు.