
IPL 2025లో, MI ఇప్పటివరకు ఒకే ఒక ఆటలో గెలవడం కొసమెరుపు. KKR (కోల్‌కతా నైట్ రైడర్స్)తో స్వదేశంలో, CSK (చెన్నై సూపర్ కింగ్స్) మరియు గుజరాత్ టైటాన్స్ (GT) చేతిలో రెండు మ్యాచ్‌ల్లో కూడా ఓడిపోయింది. ఈ క్రమంలోనే శుక్రవారం LSG (లక్నో సూపర్ జెయింట్స్)తో ఆడటానికి MI మళ్ళీ రోడ్లపైకి వచ్చింది. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో LSG తమ సొంత మైదానంలో ఆడిన మ్యాచ్ పట్ల అంతగా సంతోష కరంగా లేనప్పటికీ, లక్నో క్యూరేటర్ LSG మెంటర్ జహీర్ ఖాన్ నుండి తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నాడు. రోహిత్ శర్మ విషయంలో 'పరిస్థితులు జారిపోతున్నాయి' అని మంజ్రేకర్ అనడమే దానికి ఉదాహరణ అని చెప్పుకోవచ్చు.
ఈ నేపథ్యంలో MI బ్యాటింగ్ కోచ్ కీరాన్ పొలార్డ్ గురువారం ఈ విషయమై స్పందిస్తూ... "నేను అండర్-19 క్రికెట్ నుండి రోహిత్‌తో కలిసి ఆడుతున్నాను. రోహిత్ ఎటువంటి ఆటగాడో ఇపుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చరిత్రలో రికార్డు పుస్తకాలలో, వివిధ ఫార్మాట్లలో తన పేరును లిఖించుకున్న ఆటగాడు రోహిత్. అతని గురించి విమర్శలు చేసే ముందు ఒకటికి పది సార్లు అలోచించి చేయాలి. అతను బాగా ఆడినపుడు ఆకాశానికి ఎత్తేయడం, లేనపుడు దించేయడం కరెక్ట్ కాదు. క్రికెట్ ప్రపంచంలో అతను ఓ లెజెండ్. కొన్నిసార్లు తక్కువ స్కోర్లు చేసిన సందర్భాలు ఎవరికైనా ఉంటాయి. ఒక వ్యక్తిగా అతను తన క్రికెట్‌ను ఆస్వాదించే హక్కును సంపాదించుకున్నాడు మరియు ఇటివంటి పరిస్థితులలో అయినా ఒత్తిడికి గురికాకుండా ఉంటాడు. కాబట్టి రెండు తక్కువ స్కోర్‌లను బట్టి జనాలు తీర్పు చెప్పకూడదు." అని సపోర్ట్ చేస్తూ మాట్లాడారు.