
తొలి మ్యాచ్‌లో అద్భుతమైన విజయం సాధించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇప్పుడు హ్యాట్రిక్ ఓటములను చవిచూస్తూ నవ్వులపాలవుతోంది. ఐపీఎల్ 2025లో జరిగిన 15వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ 80 పరుగుల తేడాతో ఓడించింది. రెండు జట్ల మధ్య ఈ మ్యాచ్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరగగా... ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ టాస్ గెలిచి, ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. కానీ ఈ మ్యాచ్‌లో సన్ రైజర్స్ జట్టు అంతగా ఏమీ రాణించినట్టు కనబడలేదు. మ్యాచ్ ఆరంభంలో కేకేఆర్ ఓపెనర్లను వెంటవెంటనే ఔట్ చేసినప్పటికీ, అంతగా ప్రభావం చూపించలేదు. ఈ నేపథ్యంలోనే సన్‌రైజర్స్ ఓటమికి గల కారణాలు విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కెప్టెన్ కమిన్స్ బౌలింగ్ లో దారుణంగా విఫలమయ్యాడు. నిర్ణీత 4 ఓవర్ల స్పెల్‌లో 44 పరుగులకు ఒక వికెట్ మాత్రమే తీసుకున్నాడు. ఈ క్రమంలో జట్టు ఓటమికి కూడా ప్యాట్ కమిన్స్ ఓ రకంగా కారకుడు అయ్యాడని క్రీడా పండితులు అంటున్నారు. హర్షల్ పటేల్ మంచి బౌలింగ్ చేయగలడు. కానీ ఈ మ్యాచ్ లో హర్షల్ పటేల్ పూర్తిగా విఫలం అయ్యాడు. సన్‌రైజర్స్ తరపున హర్షల్ పటేల్ ఒక వికెట్ మాత్రమే తీసుకున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు అతిపెద్ద బలం ఓపెనింగ్ బ్యాటింగ్. ప్రపంచంలోని గొప్ప బౌలర్లు కూడా ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మల విధ్వంసకర బ్యాటింగ్ కు భయపడతారు. కానీ లీగ్ లోని మొదటి మ్యాచ్ తప్ప ఈ ఇద్దరు ఆటగాళ్లు అప్పటి నుంచి వరుసగా మూడు మ్యాచ్‌లలో పరాజయం పాలయ్యారు. తదితర కారణాల వలన సన్‌రైజర్స్‌కు నిరాశలే ఎదురవుతున్నాయి అనడంలో అతిశయోక్తి లేదు!