
కేకేఆర్ ఛేజింగ్‌లో 13వ ఓవర్‌లో ఈ అరుదైన సీన్ కనిపించింది. షార్దుల్ ఓవర్ స్టార్ట్ చేసిందే వరుసగా ఐదు వైడ్ బంతులతో, వినడానికి వింతగా అనిపించినా ఇది నిజం. మొదటి ఐదు బంతులు అంపైర్ వైడ్ అని చెప్పడంతో మళ్లీ మళ్లీ బౌలింగ్ చేయాల్సి వచ్చింది. దీంతో లక్నో ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు.
అయితే ఈ ఓవర్ చివర్లో మాత్రం సీన్ రివర్స్ అయింది. ఓవర్ స్టార్టింగ్‌లో వైడ్లతో విసిగించిన షార్దుల్, లాస్ట్ బాల్‌కు మాత్రం అద్భుతంగా ఆడుతున్న అజింక్య రహానేను ఔట్ చేశాడు. రహానే కేవలం 35 బంతుల్లోనే 61 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. కానీ షార్దుల్ వేసిన ఆ లాస్ట్ బాల్‌కు వికెట్ ఇచ్చి వెనుదిరిగాడు. మొత్తానికి షార్దుల్ ఈ ఓవర్లో 13 పరుగులు ఇచ్చాడు.
షార్దుల్ నెక్స్ట్ ఓవర్ వేయడానికి రాగానే ఫస్ట్ బాల్‌కే డేంజరస్ బ్యాటర్ ఆండ్రీ రస్సెల్‌ను పెవిలియన్ పంపాడు. రస్సెల్ కేవలం 7 పరుగులు మాత్రమే చేశాడు. అంతేకాదు, ఆ తర్వాత వేసిన బంతికే హ్యాట్రిక్ తీసే ఛాన్స్ కూడా వచ్చింది. హర్షిత్ రాణా ఆడిన బంతి పాయింట్ దిశగా దూసుకెళ్లింది. ఫీల్డర్ అబ్దుల్ సమద్ చేతిలో పడకుండా బాల్ బతికిపోయింది.. బౌండరీ వెళ్లింది. హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నారు ఫ్యాన్స్.
మ్యాచ్ మొత్తం మీద షార్దుల్ 2 వికెట్లు తీసి 52 పరుగులు ఇచ్చాడు. అందులో 8 వైడ్లు ఉన్నాయి. విచిత్రం ఏంటంటే లక్నో టీమ్‌లో అత్యంత ఎక్కువ పరుగులు ఇచ్చిన బౌలర్ మాత్రం షార్దుల్ కాదు. అవేష్ ఖాన్ తన 4 ఓవర్లలో ఏకంగా 55 పరుగులు సమర్పించాడు.
ఐపీఎల్ హిస్టరీలో 11 బంతుల ఓవర్ వేయడం ఇది మూడోసారి మాత్రమే. గతంలో 2023లో తుషార్ దేశ్‌పాండే చెన్నైలో లక్నోపై, మహమ్మద్ సిరాజ్ బెంగళూరులో ముంబై ఇండియన్స్‌పై ఇలాంటి ఓవర్లు వేశారు.
ఏది ఏమైనా షార్దుల్ ఠాకూర్ వేసిన ఈ 11 బంతుల ఓవర్ మాత్రం ఐపీఎల్ హిస్టరీలో ఎప్పటికీ ఒక వింత సంఘటనగా నిలిచిపోతుంది.