
అవును... సదరు మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన రుతురాజ్ గైక్వాడ్.. మరోసారి ఫీల్డింగ్ వైఫల్యమే తమ కొంప ముంచిందని అన్నాడు. 'గత 4 మ్యాచ్‌ల్లోనూ ఫీల్డింగ్ వైఫల్యమే మమ్మల్ని నాశనం చేసింది. మేం క్యాచ్‌లు వదిలేసిన బ్యాటర్లు 15, 20, 30 పరుగులు అదనంగా చేస్తున్నారు. గడిచిన 4 మ్యాచ్‌ల్లో ఆర్‌సీబీతో మినహా మిగతా మూడింటిలోనూ ఒకటి, రెండు, మూడు హిట్స్‌కు దూరంగా విజయాన్ని చేజేతులారా దూరం చేసుకున్నాం." అని మాట్లాడుతూ నిరాశ చెందారు.
అవును.. చెన్నై సూపర్ కింగ్స్ ప్రదర్శన నానాటికీ పేలవంగా కనిపిస్తోంది. మొత్తం 5 మ్యాచ్‌ల్లో 1 మాత్రమే గెలిచింది. ప్రస్తుతం మహేంద్ర సింగ్ ధోని జట్టు పాయింట్ల పట్టికలో 9వ స్థానంతో సరిపెట్టుకుంది. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు పట్టు బిగించినప్పటికీ, ఓడిపోయింది. తాజా మ్యాచ్‌లో మొత్తం 9 క్యాచ్‌లు జారవిడిచగా, అందులో చెన్నై 5 క్యాచ్‌లు మిస్ చేయడం కొసమెరుపు. మంగళవారం PBKSపై జరిగిన మ్యాచ్‌లో 5 క్యాచ్‌లు వదిలేసారు. ఈ టోర్నమెంట్‌లో ఏ జట్టు అయినా అత్యధిక క్యాచ్‌లను వదిలివేసిన జట్టు ఇదే కావడంతో నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. లక్నో సూపర్ జెయింట్స్, పిబికెఎస్ ఆరు క్యాచ్‌లను వదులుకుని 2వ స్థానంలో ఉన్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో మహేంద్ర సింగ్ ధోని జట్టు చెన్నై సూపర్ కింగ్స్ ఒకప్పుడు ఆధిపత్యం చెలాయించింది. కానీ ఇప్పుడు ఆ జట్టు మ్యాచ్‌లు గెలవడానికి ఇబ్బంది పడుతోంది అని అభిమానులు నిరాశ చెందుతున్నారు.