ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) 25లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఒక నిర్ణయం అనేది ఇపుడు చాలా వివాదాస్పద అంశంగా మారింది. అహ్మదాబాద్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో, రాజస్థాన్ బ్యాట్స్‌మన్ అయినటువంటి రియాన్ పరాగ్‌ అవుట్ కావడంతో వివాదం తలెత్తింది. రాజస్థాన్ ఇన్నింగ్స్‌లోని 7వ ఓవర్‌లో రియాన్ పరాగ్‌ను అంపైర్ అవుట్‌గా ప్రకటించడంతో.. ఈ వివాదాస్పద నిర్ణయం అనేది వెలుగు చూడాల్సిన పరిస్థితి దాపురించింది. సమీక్ష తీసుకున్న తర్వాత కూడా, థర్డ్ అంపైర్ నిర్ణయాన్ని మార్చుకోకపోవడం వలన క్రీడాభిమానులు ఒకింత గుర్రుగా ఉన్నారు.

అసలు, విషయంలోకి వెళితే... ఏప్రిల్ 9వ తేదీ బుధవారం అహ్మదాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ మొదట బ్యాటింగ్ చేసి, 217 పరుగుల భారీ స్కోరు టార్గెట్ గా ఉంచింది. తరువాత బరిలోకి దిగిన రాజస్థాన్ తన 2 వికెట్లను వెంటవెంటనే కోల్పోయింది. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన రియాన్ పరాగ్ వచ్చి రావడంతోనే గుజరాత్ బౌలర్లపై దాడికి దిగాడు. అతని అద్భుతమైన బ్యాటింగ్ రాజస్థాన్ స్కోరును ముందుకు పరుగెత్తించింది. ఏడవ ఓవర్‌లో ఇలా ఉండగా... లెఫ్టార్మ్ పేసర్ కుల్వంత్ ఖేజ్రోలియా బౌలింగ్ చేస్తున్నాడు. అతని నాలుగో బంతి దాదాపు యార్కర్‌గా సంధించాడు. దీనిని రియాన్ థర్డ్ మ్యాన్ వైపు ఆడాలని ట్రై చేసాడు... కానీ, అతని బ్యాట్ కింద పడగానే, బంతి దగ్గరగా వెళ్లి వికెట్ కీపర్ చేతికి చిక్కింది. దాంతో అంపైర్ దానిని అవుట్‌గా ప్రకటించాడు. దాంతో అందరూ అవాక్కయ్యారు.

ఈ క్రమంలోనే బ్యాటర్ రియాన్ DRS సహాయం తీసుకున్నాడు. బంతి బ్యాట్‌కు దగ్గరగా ఉంది. అదే సమయంలో బ్యాట్ కూడా పిచ్‌ను బలంగా తాకడం చాలా స్పష్టంగా కనబడింది. థర్డ్ అంపైర్ రీప్లే చూసినప్పుడు, బ్యాట్ ముందుగా పిచ్‌ను తాకిందని, దాని శబ్దం స్నికోమీటర్‌లో వినిపించిందని స్పష్టంగా గోచరించింది. కానీ... తరువాతి ఫ్రేమ్‌లో, బంతి బ్యాట్‌ను దాటుతున్నట్లు కనిపించిన వెంటనే, స్నికోమీటర్‌లోని శబ్దం ఎక్కువగా వినబడింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని, థర్డ్ అంపైర్ రియాన్ పరాగ్‌ను అవుట్‌గా ప్రకటించాల్సి వచ్చింది. కానీ, రియాన్ పరాగ్ మాత్రం అంపైర్ నిర్ణయంతో ఏకీభవించలేదు. అందుకే నేరుగా అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు. అతని చర్యను చూసిన ఇతర అంపైర్ కూడా మెయిన్ అంపైర్ నిర్ణయాన్ని సమర్దించాడు. ఇక అంపైర్లపై అసహనం వ్యక్తి చేసిన రియాన్, ఇక చేసేదేమీ లేక.. పెవిలియన్‌కు తిరిగి వెళ్ళిపోయాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: