
ఈ విషయమై హ్యారీ బ్రూక్ తాజాగా ఓ అంతర్జాతీయ మీడియాలో వివరణ ఇస్తూ... "ఏది ఏమైనా నేను ఇంగ్లాండ్ దేశానికి ఆడదానికే ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తాను. దానికంటే ఈ ప్రపంచంలో ఏదీ నాకు ఎక్కువ కాదు. దానికోసం వేరే టోర్నీలో వచ్చిన డబ్బులు కూడా నాకు ఎక్కువ కాదు. ఎందుకంటే? దేశానికి ఆడటాన్నే నేను ఎక్కువ ఎంజాయ్ చేస్తాను!" అంటూ పేర్కొన్నాడు. కాగా ఈ ఇంగ్లాండ్ ఆటగాడు వైట్ బాల్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు హ్యారీ బ్రూక్ కు వన్డేలు, టీ20ల్లో సారథ్య బాధ్యతలను అప్పగిస్తూ కీలక ప్రకటన ఒకటి విడుదల చేసింది.
ఇకపోతే ఈ సంవత్సరం జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఇంగ్లాండ్ పేలవ ప్రదర్శన చేసిన సంగతి అందరికీ తెలిసిందే. దానికి నైతిక బాధ్యత వహిస్తూ జోస్ బట్లర్ కెప్టెన్సీకి రాజీనామా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో హ్యారీ బ్రూక్‌ను వైట్ బాల్(పరిమిత ఓవర్ల క్రికెట్) కెప్టెన్‌గా నియమించారు. 2022లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన హ్యారీ బ్రూక్, నాటి నుంచే ఇంగ్లండ్ భవిష్యత్ కెప్టెన్ గా ముందుకు సాగాడు. హ్యారీ ఇప్పటికే వన్డేలు, టీ20ల్లో వైస్ కెప్టెన్ గా వ్యవహరించాడు. 2024లోనే జోస్ బట్లర్ వారసుడిగా హ్యారీ బ్రూక్ ఎంపికకావడం జరిగింది. హ్యారీ ప్రస్తుతం అన్ని ఫార్మాట్లలో ఆడుతున్నాడు. కెప్టెన్ అయిన తర్వాత హ్యారీ బ్రూక్ మాట్లాడుతూ.. ఇంగ్లాండ్ వైట్ బాల్ జట్టుకు కెప్టెన్ కావడం గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు పేర్కొన్నాడు.