
ఐపీఎల్ 2025 సీజన్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మంచి ఆరంభంతో మొదలుపెట్టింది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఏకంగా 200+ పరుగులు పిండేసింది. కానీ ఆ జోరును మాత్రం కంటిన్యూ చేయలేకపోయింది. ఆ తర్వాత స్కోర్లు చూస్తే.. 190, 163, 120, చివరకు 152కి పడిపోయాయి. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్ లాంటి టాప్ ప్లేయర్లు మంచి స్టార్ట్‌లు దొరికినా వాటిని భారీ స్కోర్లుగా మార్చడంలో తేలిపోతున్నారు.
మ్యాచ్‌కు ముందు జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో వెట్టోరి మాట్లాడుతూ... ప్రత్యర్థులు కూడా మా బ్యాటింగ్ లైనప్‌పై బాగా స్టడీ చేశారని, అందుకే వాళ్ల బౌలింగ్ ప్లాన్స్‌ను పర్ఫెక్ట్‌గా ఎగ్జిక్యూట్ చేస్తున్నారని ఒప్పుకున్నాడు. కొంచెం కష్టాల్లో ఉన్న మాట నిజమే అయినా, ప్లేయర్ల టాలెంట్‌పై మాత్రం తనకు పూర్తి నమ్మకం ఉందని ధీమాగా చెప్పాడు.
"మా బ్యాటర్లందరూ టచ్‌లో ఉన్నట్టే కనిపిస్తున్నారు. ఒక్కరిద్దరు కుదురుకుంటే చాలు, టీమ్ మొత్తం కాన్ఫిడెన్స్ లెవెల్స్ మారిపోతాయి. అప్పుడే మేం అసలు సిసలు ఆట ఆడతాం" అని వెట్టోరి చెప్పుకొచ్చాడు.
ఐపీఎల్ 2025 వేలం తర్వాత సీన్ మారిపోయిందని వెట్టోరి అన్నాడు. ఇప్పుడు అన్ని జట్లూ స్ట్రాంగ్‌గా ఉన్నాయి, టాలెంట్ కూడా బాగా స్ప్రెడ్ అయిందని చెప్పాడు. "ప్రత్యర్థి జట్లను తక్కువ అంచనా వేయడానికి లేదు. వాళ్లు పక్కా ప్లానింగ్‌తో వస్తున్నారు. మా బ్యాటింగ్ యూనిట్ ఎంత డేంజరో వాళ్లకు తెలుసు. అందుకే పిచ్‌లను కూడా స్టడీ చేసి మరీ బౌలింగ్ చేస్తున్నారు" అని వెట్టోరి అన్నాడు.
"ప్రతిసారీ 270, 280 కొట్టాల్సిన అవసరం లేదు. కానీ పవర్ ప్లేలో బ్యాటర్లు డామినేట్ చేసి మంచి పునాది వేస్తే చాలు, ఆటోమేటిక్‌గా మ్యాచ్ మన చేతుల్లోకి వచ్చేస్తుంది" అని ధీమా వ్యక్తం చేశాడు.