ఐపీఎల్ 2025 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. టోర్నీ సగం పూర్తయ్యేసరికి ప్లేఆఫ్ రేసు మరింత వేడెక్కింది. పాయింట్ల పట్టికలో స్థానాలు దాదాపు ఖరారైన నేపథ్యంలో, ఏ జట్టుకు ప్లేఆఫ్స్‌కు చేరే అవకాశాలు ఎంత ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచుల్లో మూడింట గెలిచి దుమ్మురేపుతోంది. వీరికి ప్లే ఆఫ్ ఛాన్స్ ఏకంగా 75 శాతం ఉంది. ఇక పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న గుజరాత్ టైటాన్స్ కూడా 74 శాతం విజయ అవకాశాలతో దాదాపు ప్లే ఆఫ్ బెర్త్ ఖాయం చేసుకునేలా ఉంది. కానీ ఇప్పుడే కన్ఫామ్ గా ఏమీ చెప్పలేము.

కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు 55 శాతం ప్లే ఆఫ్ ఛాన్స్ ఉండగా, పంజాబ్ కింగ్స్ జట్టు 52 శాతం అవకాశాలతో రేసులో నిలిచింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు సరిగ్గా మధ్యలో 50 శాతం ఛాన్స్‌తో ఊగిసలాడుతోంది. లక్నో సూపర్ జెయింట్స్ జట్టు 47 శాతం అవకాశాలతో వారిని వెన్నాడుతోంది.

ఇక పాయింట్ల పట్టికలో చివరి స్థానాల్లో ఉన్న జట్ల విషయానికొస్తే, రాజస్థాన్ రాయల్స్ జట్టుకు 27% ఛాన్స్ ఉంది. ఈ సీజన్‌లో దారుణంగా ఆడుతున్న చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు మాత్రం ప్లే ఆఫ్ రేసులో బాగా వెనుకబడిపోయాయి.

ముంబై ఇండియన్స్ జట్టుకు నామమాత్రపు ఛాన్స్, అంటే కేవలం 11 శాతం మాత్రమే ఉండగా, చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు 6% మాత్రమే ప్లే ఆఫ్ ఛాన్స్ ఉంది. ఒకప్పుడు ఈ టీం ఛాంపియన్ ట్రోఫీ గెలిచేలాగా కనిపించేది చాలాసార్లు గెలిచింది కూడా కానీ ఇప్పుడు కనీసం ప్లే ఆఫ్ లో ఆడే ఛాన్స్ కూడా దక్కించుకోలేకపోయింది. ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు పట్టికలో అట్టడుగున కేవలం 4% అవకాశాలతో నిలిచింది. తెలుగువారిగా ఇది మనకు మింగుడు పడని విషయం.

ప్రస్తుత పాయింట్ల పట్టిక ఆధారంగా వేసిన అంచనాలివి. ఇంకా చాలా మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి కాబట్టి, ఈ లెక్కలు పూర్తిగా మారే అవకాశం ఉంది. చివరి మూడు స్థానాల్లో ఉన్న జట్లు అద్భుతం చేసి ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటాయో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: