టీ20 క్రికెట్‌లో ఒక్కోసారి ఒక్క బంతి బ్యాడ్ గా పడ్డం కూడా మ్యాచ్‌ను పూర్తిగా తిప్పేస్తుంది. సరిగ్గా అలాంటి సీనే ఏప్రిల్ 12న సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), పంజాబ్ కింగ్స్ (PBKS) మధ్య జరిగిన IPL మ్యాచ్‌లో జరిగింది. SRH ఛేజింగ్‌లో 4వ ఓవర్‌లో అసలు మలుపు తిరిగింది. యష్ ఠాకూర్ వేసిన బంతికి అభిషేక్ శర్మ అవుటయ్యాడు. కానీ అది నో బాల్ కావడంతో సీన్ రివర్స్ అయింది.

అప్పటికి SRH స్కోరు 3.3 ఓవర్లలో 50/0. భారీ టార్గెట్ 245ను ఛేజ్ చేస్తోంది. అభిషేక్ పుల్ షాట్ ఆడబోయి దొరికిపోయాడు. పంజాబ్ సంబరాల్లో మునిగిపోయింది. కానీ అంపైర్ నో బాల్ అని సైగ చేశాడు. దాంతో, అభిషేక్‌కు మళ్లీ లైఫ్ వచ్చింది. పైగా ఫ్రీ హిట్ కూడా. దాన్ని సిక్స్‌గా మలిచాడు. వికెట్ పడగొట్టాల్సిన ఓవర్‌ అది. కానీ దాని వల్ల SRHకు అదనంగా 9 పరుగులు వచ్చాయి. 4 ఓవర్లు పూర్తయ్యేసరికి స్కోరు 60/0కి చేరింది.

నాలుగో ఓవర్‌లో యష్ ఠాకూర్ వేసిన ఫస్ట్ బాల్ డాట్.. టెన్షన్ పెంచింది. కానీ సెకండ్ బాల్ మాత్రం బౌండరీకి తరలిపోయింది. ఇక మూడో బంతి అయితే ఏకంగా సిక్సర్. స్టేడియం దద్దరిల్లిపోయింది. ఆ వెంటనే నాలుగో బంతికి అభిషేక్ అవుటయ్యాడు.. పంజాబ్ సంబరాలు చేసుకుంటుండగా.. అంపైర్ అది నో బాల్ అని తేల్చాడు. అభిషేక్‌కు లైఫ్ రావడం మాత్రమే కాదు.. ఫ్రీ హిట్ కూడా దక్కింది. ఆ ఫ్రీ హిట్‌ను మళ్ళీ సిక్సర్ బాదేశాడు.

ఆ నో బాల్ తర్వాత అభిషేక్ శర్మ గేర్ మార్చేశాడు. రెచ్చిపోయి ఆడాడు. ఆ ఛాన్స్ దొరికే వరకు 35 పరుగులే చేసిన అభిషేక్.. ఆ తర్వాత 47 బంతుల్లోనే 106 పరుగులు పిండేశాడు. మొత్తం 59 బంతుల్లో 141 రన్స్ కొట్టాడు. అందులో 14 ఫోర్లు, 10 సిక్సులు ఉన్నాయి.

SRH కొట్టిన మొత్తం 247 పరుగుల్లో అభిషేక్ ఒక్కడే 57% స్కోర్ చేశాడు. ఒకవేళ 35 పరుగుల దగ్గరే అవుటై ఉంటే SRH ప్రెషర్‌లో పడేది. ట్రావిస్ హెడ్ (66), క్లాసెన్ ఫామ్‌లో ఉన్నా.. అభిషేక్ అవుట్ కావడంతో ఛేజింగ్ స్లో అయ్యేది. బహుశా SRH స్కోరు 200–220 దగ్గర ఆగిపోయేది. మ్యాచ్ ఓడిపోయే ఛాన్స్ కూడా ఉండేది.

యష్ ఠాకూర్ వేసిన ఆ ఒక్క నో బాల్.. వికెట్‌ను మాత్రమే కాదు.. మ్యాచ్ మొమెంటమ్‌నే మార్చేసింది. లాకీ ఫెర్గూసన్ గాయం కారణంగా మధ్యలో వెళ్ళిపోవడంతో పంజాబ్ పట్టు కోల్పోయింది. చివరికి SRH 8 వికెట్ల తేడాతో, 5 బంతులు మిగిలి ఉండగానే గెలిచింది. అవును.. ఒక్క నో బాల్.. మ్యాచ్‌ను టర్న్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: