
ఐపీఎల్ 2025 టోర్నమెంట్‌లో చెన్నై సూపర్ కింగ్స్ వరుస పరాజయాల పరంపర కొనసాగిస్తోంది. ఇప్పటి వరకు ఆ జట్టు ఆడిన 6 మ్యాచ్ లలో కేవలం ఒక్కటి మాత్రమే గెలిచి ఐదు మ్యాచ్ లలో చిత్తు గా ఓడిపోయింది. మరీ దారుణంగా తక్కువ పరుగులు చేస్తూ చెత్త రికార్డులను తన ఖాతాలో వేసుకుంటోంది. ఇక చెన్నై చిత్తు గా ఓడిపోవడం తో చెన్నై అభిమానులు .. అటు తమిళనాడు ప్రజలు కూడా ధోనిని విమర్శిస్తున్నారు. అయితే సోషల్ మీడియా లోనూ చెన్నై పరాజయాలకు ధోనీ యే కారణం అన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై కొందరు ధోనీ కి సపోర్ట్ గా కామెంట్లు చేస్తున్నారు.
ధోనీకి 43 సంవత్సరాలు ... చెన్నై బ్రాండ్ ఇమేజ్ తగ్గకూడదు అని టీమ్ మేనేజ్‌మెంట్ అతడిని అతడిని బలవంతంగా ఆడిస్తుంది ... బహుశా అతనికి కూడా క్రికెట్ ఆడటం ఇష్టం ఉండకపోవచ్చు,మొదట నుండి ఉన్న బాండింగ్ వల్ల ఒప్పుకుని ఉంటాడు అని కామెంట్ చేస్తున్నారు. అయినా అతను వయసుకు మించి వికెట్ల వెనుక కీపింగ్ చేస్తున్నాడు,బ్యాటింగ్ కూడా బాగానే చేస్తున్నాడు అని ధోని కి మద్దతు ఇస్తున్నారు. ఇక
ఎవరు అవునన్నా కాదన్నా ఇంటర్నేషనల్ క్రికెట్ లెజెండ్స్ లో ధోని ఒకడు ... ఈ విషయం లో ఎవ్వరికి ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. దేశానికి అతను సాధించి ఇచ్చిన వాటిని దృష్టిలో ఉంచుకుని అయినా అతన్ని ట్రోల్ చేయడం ఆపండి,ఆఫ్ట్రాల్ ఐపిఎల్ ఒక ప్రయివేటు లీగ్,దాని మాయలో పడి దేశానికి పేరు తెచ్చిన క్రికెటర్లను అవమానించకండి అంటూ ధోనీకి సపోర్ట్ గా కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా రేపు లోక్నో తో జరిగే మ్యాచ్ లో చెన్నై ఓడిపోతే ప్లే ఆప్ నుంచి దాదాపు తప్పుకున్నట్టే అవుతుంది.