లక్నోలోని ఎకానా స్టేడియంలో, ఐపీఎల్ 25 30వ మ్యాచ్ లక్నో సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన సంగతి అందరికీ తెల్సిందే. ఈ మ్యాచ్ లో చెన్నై చాలా చాకచక్యంగా ఆడి లక్నోను 5 వికెట్లు తేడాతో పెవిలియన్ కి సాగనంపింది. ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేయడం జరిగింది. లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ అత్యధికంగా 63 పరుగులు చేసి తన ఉనికిని చాటుకున్నప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది.

చెన్నై బౌలర్లు మతిషా పతిరానా, రవీంద్ర జడేజా చెరో 2 వికెట్లు పడగొట్టగా.. ఖలీల్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్ చెరొక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. 167 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ 19.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది. ఈ క్రమంలో మ్యాచ్ ముగిసిన తరువాత లక్నో కెప్టెన్ అయినటువంటి రిషబ్ పంత్ మ్యాచ్ ఓటమికి గల కారణాలను వెల్లడించాడు.

పంత్ మాట్లాడుతూ.. "మేము 10 నుంచి 15 పరుగులు తక్కువ స్కోర్ చేశామని ఈ సందర్భంగా చెప్పడానికి నేను సిగ్గుపడను. మంచి దూకుడు మీద ఆడుతున్నప్పుడు కూడా దురదృష్టవశాత్తు వికెట్లు కోల్పోయాం. పిచ్ లో అయితే నాకు ఎలాంటి లోపం కనబడలేదు. కానీ, మా జట్టు ఎక్కువ పరుగులు చేసి ఉండాల్సింది. పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగానే ఉంది. ప్రతి మ్యాచ్ లో అయితే నేను మెరుగ్గా ఉన్నాను. కానీ కొన్ని సార్లు ప్రయత్నించిన తర్వాత కూడా మంచి ఫలితాలు రావడం, రాకపోవడం అనేది మన చేతుల్లో ఉండదు. నేను నెమ్మదిగా నా ఫామ్ లోకి తిరిగి వచ్చి ప్రతి మ్యాచ్ పై దృష్టి సారిస్తున్నాను!" అని రిషబ్ పంత్ అన్నాడు. అదే సమయంలో పంత్ బిష్ణోయ్ గురించి మాట్లాడుతూ.. "ఈ మ్యాచ్ లో బిష్ణోయ్ కి ఎక్కువ ఓవర్లు ఇవ్వాల్సింది. కానీ, మేము ఇవ్వలేకపోయాం. చివరి ఓవర్ బౌలింగ్ చేయలేకపోయాం. పవర్ ప్లేలో మా బౌలింగ్ కాస్త వీక్ గా వుంది. ప్రతి మ్యాచ్ నుంచి ఏదో ఒక దానిని నేర్చుకోవాలనుకుంటున్నాం. భవిష్యత్తులో మెరుగ్గా రాణించడానికి ప్రయత్నిస్తాం.!" అని రిషబ్ పంత్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: